Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: అంతా రాజకీయమే

By:  Tupaki Desk   |   16 Feb 2019 12:33 PM GMT
ట్రైలర్ టాక్: అంతా రాజకీయమే
X
ఎన్టీఆర్ బయోపిక్ గా విడుదల ముందు వరకు విపరీతమైన అంచనాలు మోసుకొచ్చిన కథానాయకుడు తీవ్రంగా నిరాశ పరిచాక సీక్వెల్ గా వస్తున్న మహానాయకుడు మీద భారీ అంచనాలు లేవు కానీ ఫస్ట్ పార్ట్ లో మిస్ అయిన అంశాలను ఇందులో జోడించి ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చక్కగా ఆవిష్కరిస్తారనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. 22న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో దీని ట్రైలర్ ఇందాక రిలీజ్ చేసారు. ముందు నుంచి చెబుతున్నట్టే ఇందులో ఎన్టీఆర్ నట జీవితం ఛాయలు లేకుండా కేవలం రాజకీయ ప్రస్థానాన్ని మాత్రమే చూపించారు.

టిడిపి పార్టీ పెట్టాక అధికారంలోకి రావడం ఎన్టీఆర్ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు అంతా తానై నడిపించే ప్రయత్నం చేయడం సంక్షేమ పధకాలు తీసుకురావడం అన్ని టచ్ చేసారు. చంద్రబాబు పాత్ర పోషించిన రానాతో చెప్పేవాడు లేకపోతే ఆరు కోట్ల మందున్నా ఎన్టీఆర్ ఒంటరైపోతాడు అని చెప్పించడం మొత్తం పొలిటికల్ డ్రామాతో నింపేశారు. బసవతారకం చికిత్స కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ పరిణామాలు ఎలా మారిపోయాయో కూడా చూపించారు.

అంచనాలకు తగ్గట్టే మహానాయకుడు మొత్తం రాజకీయంతో నిండిపోయింది. చంద్రబాబు కన్నా సచిన్ కెద్కర్ వేసిన నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర ఎక్కువ నెగటివ్ షేడ్స్ లో ఉన్నట్టు కనిపించింది. ఇందిరా గాంధీని కూడా చూపించేసారు. ఒక సీన్ లో కృష్ణుడి కటౌట్ చూసి ఆమె దండం పెట్టుకుంటే పక్కనే ఉండే అసిస్టెంట్ అతను మన అపోజిషన్ పార్టీ అని చెప్పడం లాంటి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. మొత్తానికి మహానాయకుడు ఎన్టీఆర్ రాజకీయంతో నిండిపోయింది. కీరవాణి సంగీతం బాగా ఎలివేట్ అయ్యింది. బాబుని ఎక్కువ ప్రొజెక్ట్ చేయకుండా క్రిష్ సేఫ్ గేమ్ ఆడాడు. 22న విడుదల కానున్న మహానాయకుడు ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. వాటిని నిలబెట్టుకోవడమే మిగిలింది