Begin typing your search above and press return to search.

తూచ్.. ఎన్టీఆర్ లుక్ అది కాదట

By:  Tupaki Desk   |   5 Dec 2018 1:00 PM GMT
తూచ్.. ఎన్టీఆర్ లుక్ అది కాదట
X
జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా - నందమూరి మల్టిస్టారర్ కు సంబంధించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ బొద్దుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. #RRR కోసం తారక్ 100 కిలోలకు పైగా బరువు పెరుగుతున్నాడని.. ఈ సినిమాలో భారీకాయుడిగా కనిపిస్తాడని వార్తలు వచ్చాయి.

కానీ ఈ ఫోటోలపై తారక్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను పోస్ట్ చేసి "గైస్.. ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న తారక్ ఫోటోలు ఏడాది కిందటివి.. ఇది ప్రస్తుతం తారక్ లుక్ కాదు" అంటూ ట్వీట్ చేశాడు. అలా అని ఎన్టీఆర్ ఈ సినిమాలో హెవీ గా కనిపిస్తాడా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇక #RRR ఫస్ట్ షెడ్యూల్ లో రాజమౌళి కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరించాడు. ఈ షెడ్యూల్ లో మెగా నందమూరి హీరోలిద్దరూ పాల్గోనడం విశేషం. రాజమౌళి ఈ షెడ్యూల్ నుండి కొద్దిరోజులు చరణ్ కు బ్రేక్ ఇచ్చాడట. చరణ్ మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు