ఎన్టీఆర్ కథానాయకుడు 3 డేస్ కలెక్షన్స్

Sat Jan 12 2019 16:19:27 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రిలీజ్ 'ఎన్టీఆర్ కథానాయకుడు' రివ్యూలు రేటింగ్స్ బాగానే ఉన్నాయి గానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు కోటి ఇరవై లక్షల వరకూ వసూలు చేసింది. మూడో రోజుకు కలెక్షన్స్ మరింతగా దిగజారాయి.మూడో రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కథానాయకుడు' రూ. యాభై లక్షలు కూడా తీసుకురాలేకపోయింది. ఓవరాల్ గా మూడు రోజులకు గానూ ఏపీ తెలంగాణాలలో 'కథానాయకుడు' రూ. 9.30 కోట్ల రూపాయ లషేర్ మాత్రమే సాధించింది.  సినిమాపై హైప్ ఉండడంతో భారీ రేట్లకు థియేట్రికల్ రైట్స్ కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఈ కలెక్షన్స్ నిద్రలేకుండా చేసేవే.  పండగ రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మెరుగ్గా ఉంటాయేమో వేచి చూడాలి.

పోటీలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు అంతంతమాత్రమే కావడం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాకు ప్లస్సే గానీ ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తే మాత్రం రికవరీ బాటలో పయనించడం కాస్త కష్టమే.