ఎన్టీఆర్.. చిరు.. ఇప్పుడు జూనియర్

Fri Sep 22 2017 17:00:01 GMT+0530 (IST)

ఒక సినిమాలో ఒక హీరో డబుల్ రోల్స్ చేయడం మనం చాలానే సినిమాల్లో చూస్తుంటాం. కానీ స్టార్ హీరో మూడేసి పాత్రలలో కనిపించడం మాత్రం మహా అరుదుగా జరిగే విషయం. సినిమా మొత్తం మూడు పాత్రలు ఉండడం.. ఒక రోల్ తో మరో రోల్ ఇంటరాక్ట్ అవుతూ ఉండేలా చాలా తక్కువ సినిమాలుంటాయి.టాలీవుడ్ లో అయితే.. మొదటగా సీనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఇలాంటి ప్రయోగం చేశారు. దాన వీర శూర కర్ణ చిత్రంలో.. కర్ణుడిగా కృష్ణుడిగా.. ధుర్యోధనుడిగా ఎన్టీఆర్ మూడు పాత్రలు చేసి మెప్పించారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో మూడు పాత్రలలో నటించి మెప్పించారు. రౌడీగా.. పోలీస్ గా.. బ్రాహ్మణుడి పాత్రలో నటించారు చిరు.  ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి మెప్పించగలగడం విశేషం.

జై లవ కుశ చిత్రంలో.. రావణుడిగా..లవకుమార్.. కుశుడిగా నటించాడు ఎన్టీఆర్. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఈ మూడు పాత్రలు ఒకదానితో మరొకటి.. ఒకేసారి మూడు పాత్రలు కూడా స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇలా మూడేసి పాత్రలలో కనిపించిన ఇతర హీరోల విషయానికి వస్తే.. ముగ్గురు మొనగాళ్లు టైటిల్ పైనే రూపొందిన పాత చిత్రంలో శోభన్ బాబు నటిస్తే.. సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేశారు.

మైకేల్ మదన కామరాజు మూవీలో కమల్ హాసన్ కూడా ట్రిపుల్ రోల్ చేశారు. ఇప్పుడీ అరుదైన క్లబ్ లో ఎన్టీఆర్ కూడా చేరాడు.