Begin typing your search above and press return to search.

జ‌న‌తా గ్యారేజ్... ప్రీమియ‌ర్లతోనే రికార్డులా?

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:38 PM GMT
జ‌న‌తా గ్యారేజ్... ప్రీమియ‌ర్లతోనే రికార్డులా?
X
ఇచ‌ట అన్ని రిపేర్లూ చేయ‌బ‌డును అంటున్నాడు ఎన్టీఆర్... త‌న `జ‌న‌తా గ్యారేజ్` గురించి! కానీ ఆయ‌న అభిమానులు మాత్రం `ఇచ‌ట అన్ని రికార్డులూ తిర‌గ రాయ‌బ‌డును` అని ధీమాగా చెప్పుకొంటున్నారు. ప‌రిస్థితి చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానుల మాట‌లే నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. అమెరికాలో కొద్దిసేప‌టి క్రిత‌మే జ‌న‌తా గ్యారేజ్ ప్రీమియ‌ర్లు షురూ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 74,246 డాల‌ర్లు వ‌సూళ్లొచ్చాయి. ఆ లెక్క‌లు క్ష‌ణ‌క్ష‌ణానికీ వేగంగా మారిపోతున్నాయి. వాట‌న్నిటినీ చూసుకొంటున్న ట్రేడ్ వ‌ర్గాలు `జ‌న‌తా గ్యారేజ్` ఓవ‌ర్సీస్‌ లో ప్రీమియ‌ర్ల‌తో రికార్డులు కొట్టొచ్చ‌ని చెబుతున్నాయి.

సినిమాకి పాజిటివ్ బ‌జ్ ఉంది కాబ‌ట్టి, లోక‌ల్‌ గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రావొచ్చ‌ని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓవర్సీస్ ప్రీమియ‌ర్లు, ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వ‌చ్చే వ‌సూళ్ల విష‌యంలో రికార్డులు ఆశిస్తున్నారు. మ‌రి ఎన్ని రికార్డులు తిర‌గ‌రాయ‌బ‌డ‌తాయో చూడాలి. ఎన్టీఆర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. కొన్ని గంట‌ల క్రిత‌మే ఆయ‌న మీడియాతో స‌మావేశమ‌య్యాడు. ఎలాంటి టెన్ష‌న్ లేకుండా ఫ్రీగా క‌నిపించాడు.