Begin typing your search above and press return to search.

గ్యారేజ్ దగ్గరకే జై లవ కుశ!!

By:  Tupaki Desk   |   24 April 2017 8:40 AM GMT
గ్యారేజ్ దగ్గరకే జై లవ కుశ!!
X
సెంటిమెంట్స్ కి సినిమాలకు బోలెడంత లింక్ ఉంటుంది. పండుగల సీజన్.. సమ్మర్ లాంటి టైమ్ లో అయితే.. కాసింత సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి అయినా.. తమ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతారు కానీ.. అన్ సీజన్ లో మాత్రం భారం అంతా వాటిపైనే ఉంటుంది.

గతేడాది సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్. అన్ సీజన్ లో వచ్చినా.. అంచనాలను అందుకున్న ఈ మూవీ.. అభిమానులను అలరించి.. ఇండస్ట్రీ హిట్స్ లో చోటు సంపాదించింది. ఇప్పుడు చేస్తున్న జై లవ కుశ విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలని చూస్తున్నాడట యంగ్ టైగర్. జై లవ కుశ మూవీని కూడా అదే సెప్టెంబర్ 1కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం శరవేగంగా షెడ్యూల్స్ జరుపుకుంటుండగా.. షూటింగ్ ప్రోగ్రెస్ ప్రకారం రిలీజ్ డేట్ ఫిక్స్ ను చేస్తారని తెలుస్తోంది.

అయితే.. ఆగస్ట్ 11 తేదీ ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ అయినా.. ఇప్పుడు సెప్టెంబర్ 1కి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ లో.. రాశి ఖన్నా.. నివేదా థామస్ లు హీరోయిన్స్ కాగా.. మరో చిన్న పాత్రకు స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేస్తారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/