Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఖాతాలో రెండో ఫిలింఫేర్

By:  Tupaki Desk   |   18 Jun 2017 4:41 AM GMT
ఎన్టీఆర్ ఖాతాలో రెండో ఫిలింఫేర్
X
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. టెంపర్ నుంచి స్టార్ట్ చేసి ఫామ్ లోకి వచ్చేసిన ఎన్టీఆర్.. అక్కడి నుంచి వరుసగా హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ ఇలా రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలోకి ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చేసింది.

2017 సంవత్సరానికి గాను హైద్రాబాద్ నోవోటెల్ లో జరగనున్న జియో ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు యంగ్ టైగర్. నాన్నకు ప్రేమతో చిత్రంలో చూపిన నటనా ప్రతిభకుగాను ఎన్టీఆర్ కు ఈ అవార్డ్ దక్కింది. రీసెంట్ గా అభయ్ రామ్ పుట్టిన రోజును సంతోషంగా జరుపుకున్న ఎన్టీఆర్ కు.. అంతలోనే ఫిలింఫేర్ అవార్డ్ దక్కడం స్పెషల్ గా చెప్పుకోవాలి. నిజానికి కొడుకు అభయ్ రామ్ పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ కు వరుసగా అవార్డులు వస్తూనే ఉన్నాయి. సినీ మా అవార్డుల్లో భాగంగా టెంపర్ చిత్రానికి చిరంజీవి చేతుల మీదుగా ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నాడు. ఐఫా.. సైమాల్లో జనతా గ్యారేజ్ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది.

ప్రస్తుతం నాన్నకు ప్రేమతోకు అందుకోనున్న ఫిలింఫేర్ ఎన్టీఆర్ కు రెండవది. 2007లో యమదొంగ చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ మేల్- తెలుగు కేటగిరీలో బెస్ట్ యాక్టర్ అందుకున్నాడు ఎన్టీఆర్. మళ్లీ 10ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ను ఈ అవార్డ్ వరించడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/