Begin typing your search above and press return to search.

సమంతను ఫస్ట్ ఎన్టీఆర్ ఏమని అడిగాడు?

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:21 AM GMT
సమంతను ఫస్ట్ ఎన్టీఆర్ ఏమని అడిగాడు?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సమంత.. ఇది క్రేజీ కాంబినేషన్ అనాల్సిందే. హిట్టు ఫ్లాపుల సంగతి పక్కన పెడితే.. ఎనిమిదేళ్లలో ఒక జంట నాలుగు సార్లు కలిసి కనిపించడం అనేది చిన్న విషయం కాదు. బృందావనం తో మొదలైన వీరిద్దరి ప్రయాణం.. రామయ్యా వస్తావయ్యా.. రభస తర్వాత ఇప్పుడు జనతా గ్యారేజ్ లో నూ కొనసాగుతోంది. అయితే.. బృందావనం చేసేనాటికి సమంత చిన్న హీరోయిన్ కాగా.. ఇప్పుడు టాప్ హీరోయిన్. మరి మొదట సమంతను సెట్స్ లో చూడగానే ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటి?

ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసి షూటింగ్ టైమ్ కంటే ముందే వాలిపోయిందట సమంత. తను కనిపించగానే మొదట తన దగ్గరకు నడుచుకుంటూ వచ్చి.. 'సో.. యు ఆర్ ది న్యూ కిడ్ ఇన్ బ్లాక్' అన్నాడట జూనియర్. అప్పుడు తెగ తడబడిపోయిన సమంత.. యస్ సార్ అని మాత్రమే సమాధానం ఇవ్వగలిగానని అంటోంది. అయితే.. తర్వాత రెండు సినిమాలు చేయడం.. ఇప్పుడు నాలుగోసారి కలిసి నటిస్తుండడం ర్యాపో బాగా పెరిగిందని చెబుతోంది.

జనతాగ్యారేజ్ షూటింగ్ లో సమంత పాల్గొన్న మొదటి రోజునే.. ప్రీ క్లైమాక్స్ షూటింగ్ చేసేశారట. ఓ లాంగ్ సీన్ చేయాల్సి ఉండగా.. మొత్తం సింగిల్ టేక్ లోనే కంప్లీట్ చేసేయాలన్నది ముందుగా అనుకున్న కండిషన్. అయితే.. ఎన్టీఆర్ తో తనకున్న ర్యాపో కారణంగానే.. అంత పెద్ద సీన్ ని సక్సెస్ ఫుల్ గా అద్భుతంగా సింగిల్ టేక్ లో చేశామని చెప్పిన సమంత.. ఆ సీన్ పూర్తవగానే.. ఈసినిమా పెద్ద హిట్ అవుతుందని అర్ధమైందని అంటోంది.