Begin typing your search above and press return to search.

స‌మంత‌పై లైవ్‌ లో ఫైర్ అయిన ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:30 PM GMT
స‌మంత‌పై లైవ్‌ లో ఫైర్ అయిన ఎన్టీఆర్‌
X
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ గా గుర్తింపు పొందిన స‌మంత‌పై తార‌క్ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయాడు. ఇది జ‌న‌తా మూవీలో అనుకోమాకండి రియ‌ల్‌ గానే! స‌మంత‌పై తార‌క్‌ కి ఎంత కోపం వ‌చ్చిందంటే.. మాటల్లో చెప్ప‌లేనంత‌. మ‌రేం చేసుంటాడు? మ‌రేం చేశాడో చూద్దాం.. కొర‌టాల శివ‌ - తార‌క్‌ ల సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కిన జ‌న‌తా గ్యారేజీ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయితే, మూవీని డిఫ‌రెంట్‌ గా ప్ర‌మోష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించిన యూనిట్ బృందం దీనికిగాను అనేక మార్గాల‌ను ఎంచుకుంది. ఈ క్ర‌మంలో అన్ని టీవీల్లోనూ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే నిన్న ఓ టీవీలో లైవ్ షో ద్వారా ఇంట‌ర్వ్యూ ఇవ్వాల‌ని తార‌క్‌ - కొర‌టాల సిద్ధ‌మ‌య్యారు.

దీంతో మూవీలో తార‌క్ స‌ర‌స‌న హీరోయిన్‌ గా న‌టించిన స‌మంత‌ని కూడా ఇన్వైట్ చేశారు. స‌రిగ్గా లైవ్ షోకి టైం క‌ల్లా అటెండైపోయాడు తార‌క్‌. డైరెక్ట‌ర్ కొర‌టాల కూడా టైంకే వెళ్లిపోయాడు. కానీ, స‌మంత మాత్రం.. స‌మ‌యానికి స్టూడియోకి చేరుకోలేదు. . పోనీలే మేకప్ వేసుకోవడానికి కాస్త టైం పడుతుందేమో అని తారక్ అనుకున్నాడు. అలా 15 నిమిషాలు వెయిట్ చేశాడు. అయినా సమంత రాలేదు. ఏకంగా 30నిమిషాలు వెయిట్ చేశాడు. అయినా కూడా సమంత రాలేదు. అప్పటికీ ఓపిగ్గా మరో 15 నిమిషాలు చూశాడు. కానీ సమంత రాలేదు.

అప్పటికే 45 నిమిషాలు వెయిట్ చేసి - ఓపిక నశించిపోయిన తారక్ లేచాడు. వెళ్లిపోదామని ఫిక్స్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే సమంత వచ్చింది. సమంతను చూసిన వెంటనే తారక్ కు కోపం న‌షాళానికి అంటింది. చెడా మ‌డా తిట్టేద్దామ‌నుకున్నాడు. ఇంత‌లోనే సారీ చెప్పిన స‌మంత‌.. త‌న లేట్‌ కి రీజ‌న్‌ కూడా చెప్పింది! అంతే.. ఇంకే ముంది ఆ రీజ‌న్ విన్నాక తార‌క్ ఐసైపోయాడు. ఓ ఛారిటీ కార్యక్రమం వల్లనే లేట్ అయిందని సమంత చెప్పడంతో ఎన్టీఆర్ శాంతించాడు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ షురూ చేశారు. ఇదీ.. తార‌క్.. స‌మంత‌పై వ‌చ్చిన కోపం తాలూకు క‌హానీ!!