Begin typing your search above and press return to search.

వర్మకు ఎన్టీఆర్ దొరికేశాడు

By:  Tupaki Desk   |   16 Oct 2017 6:51 AM GMT
వర్మకు ఎన్టీఆర్ దొరికేశాడు
X
నందమూరి బాలకృష్ణ చేయబోయే ఎన్టీఆర్ సినిమాలో ఆయనే తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. మరి రామ్ గోపాల్ వర్మ తీయబోయే ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎవరన్న ప్రశ్న జనాల్లో కుతూహలం రేకెత్తిస్తోంది. ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ తో పాటుగా మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి కొంత కాలంగా. ఐతే ఈ పాత్రను తెలిసిన నటులతో చేయించట్లేదని తేల్చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ పాత్రకు ఇప్పటికే ఓ నటుడిని ఎంచుకుని అతడికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు వర్మ వెల్లడించాడు. ఆ నటుడు అచ్చం ఎన్టీఆర్ పోలికలతోనే ఉంటాడని వర్మ వెల్లడించడం విశేషం. మరోవైపు లక్ష్మీపార్వతి పాత్రకు రోజాను ఎంచుకుంటున్నట్లు వచ్చిన వార్తల్ని కూడా వర్మ ఖండించాడు. ఈ పాత్రను కూడా ఓ కొత్త నటితో చేయిస్తున్నట్లు వెల్లడించాడు. మిగతా పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిపాడు.

మొన్న అడిగితే ఇంకా నటీనటులెవరినీ ఎంచుకోలేదని అన్న వర్మ.. ఇంతలోనే ఎన్టీఆర్ పాత్రకు నటుడు ఎంపికైపోయాడని - అతను అచ్చం ఎన్టీఆర్ లాగే ఉంటాడని అంటున్నాడు. నిజ జీవిత పాత్రలకు నటీనటుల్ని ఎంచుకోవడం.. వాళ్ల నుంచి అద్భుతమైన ఔట్ పుట్ రాబట్టడంలో వర్మ స్టైలే వేరు. ముంబయి దాడుల మీద తీసిన సినిమాలో కసబ్.. వీరప్పన్ సినిమాలో వీరప్పన్.. వంగవీటి చిత్రంలో లీడ్ రోల్ లకు నటీనటుల్ని ఎంచుకుని వారిని ఆ పాత్రల కోసం మౌల్డ్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. మరి ఎన్టీఆర్ పాత్ర విషయంలోనూ వర్మ అలాగే మెప్పిస్తాడేమో చూద్దాం.