Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫాన్స్ అభిమానం

By:  Tupaki Desk   |   27 Aug 2016 6:22 AM GMT
ఎన్టీఆర్ ఫాన్స్ అభిమానం
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం "జనతా గ్యారేజ్" తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమాంత - నిత్యా మీనన్ లు కథానాయికలుగా నటిస్తుండగా.. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఒక ప్రధాన పాత్రను పోషించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయిలో ఈరోస్ సంస్థనుంచి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. అభిమానులు కూడా భారీ హడావిడే చేస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే ప్రేక్షాదారణ పొందింది. జూనియర్ స్టైలిష్ లుక్స్ - మోహన్ లాల్ స్పెషల్ ఎట్రాక్షన్ కి తోడు.. కొరటాల శివ ఫుల్ ఫాం లో ఉండటం ఈ చిత్రంపై భారీ అంచనాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. సుమారు రెండువేల థియేటర్లలో విడుదల చేయడానికి భారీ ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో సినిమా విడుదల సందర్భంగా పోస్టర్లకు దండలు - కటౌంట్లకు పాలాభిషేకాలు - థియేటర్లకు మేకప్ లు సర్వసాదారణమైన విషయాలుగా భావించారో ఏమో కానీ.. ఈ సినిమా విడుదల సందర్భంగా జూనియర్ అభిమానులు పచ్చబొట్లు పొడిపించుకునే వరకూ వెళ్లిపోయారు.

ఇప్పటికే అభిమానం విషయంలో హద్దులు పాటించాలని, శృతిమించిన అభిమానం చేటని ఒకపక్క వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరు ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా యంగ్ టైగర్ అభిమానులు ఈ సినిమా పేరును - ఎన్టీఆర్ ఫేసునూ చాతిపైనా - మొహంపైనా పచ్చబొట్లుగా వేయించుకుని తమ వీరాభిమానం చాటుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో ఈ ఫోటోలు హల్ చల్ మామూలుగా లేదు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు - జూనియర్ పై ఆశలు ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇవే తాజా ఉదాహరణలు!!