Begin typing your search above and press return to search.

ఏడు రోజులు ఎనిమిది కోట్లు

By:  Tupaki Desk   |   20 July 2017 6:06 AM GMT
ఏడు రోజులు ఎనిమిది కోట్లు
X
బిగ్ బాస్ మొన్నటివరకు బుల్లితెర మీడియా మొత్తం ఈ రియాల్టీ షో గురించే డిస్కషన్స్. అయితే ఒక్కసారి ఈ షో టెలికాస్ట్ అయిన తరువాత మొత్తం గ్రాఫ్ పడిపోయింది. ముందు నుంచి తారక్ అభిమానులకి ఈ షోని తమ అభిమాన హీరో హోస్ట్ చేయడం మింగుడపడటం లేదు. దీనికి తోడు ఈ షోలో ఉన్న పార్టిస్ పెంట్స్ మొత్తం బిలో యావరేజ్ రేంజ్ ఉన్న నటీనటులే కావడంతో ఫ్యాన్స్ బిగ్ బాస్ పై మరింత గుర్రుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. యన్టీఆర్ ఏంటి, వాళ్లని ఇంట్రడ్యూస్ చేస్తూ చప్పట్లు కొట్టడం ఏంటి, వాళ్లని ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి అనే కామెంట్స్ ఈ షో పై సోషల్ మీడియాలో విపరీతంగా పడుతున్నాయి. చినికి చినికి వానైనట్లు ఇది కాస్తా యన్టీఆర్ వరుకు వెళ్తే పరిస్థితి తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఈ షోని టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ వాళ్లు టెన్షన్ పడుతున్నారని సమాచారం.

అయితే మరోవైపున ఈ షోని హోస్ట్ చేస్తున్నందుకు యన్టీఆర్ కు భారీగా పారితోషికం అందిందని తెలిసింది. మొత్తం ఏడు రోజులు పాటు యన్టీఆర్ ఈ షో షూటింగ్ లో పాల్గొంటాడట, అందుకోసం రోజుకి కోటికి పైగా యన్టీఆర్ ఛార్జ్ చేస్తున్నాడట. ఇంతవరకు తెలుగునాట బుల్లితెర పై ఇదే ఎక్కువ రెమ్యూనీరేషన్ అని, అంత డబ్బు తీసుకుంటున్నాడు కాబట్టే యన్టీఆర్ తన షోలో ఉన్న పార్టిస్ పెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయాన్ని తారక్ ఫ్యాన్స్ కూడా ఏమైనా పరిగణలోకి తీసుకొని సైలెంట్ అవుతారేమో చూడాలి.