Begin typing your search above and press return to search.

అనిరుద్ పై అభిమానుల అనుమానం ?

By:  Tupaki Desk   |   17 Oct 2017 1:55 PM GMT
అనిరుద్ పై అభిమానుల అనుమానం ?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు చాలా కొత్త తరహా కథలను ట్రై చేస్తున్నారు. అదే విధంగా వారి అభిమానులకు ఏది ఎక్కువ ఇష్టమో అది ఉండేలా కూడా చూసుకుంటున్నారు. ప్రస్తుతం అదే తరహాలో యంగ్ టైగర్ కొన్ని ప్రయోగాలనే చేస్తున్నాడని చెప్పాలి. ముఖ్యంగా తారక్ ఇంతకుముందు ఫుల్ మాస్ తరహాలో ఉండేలా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చారు.

మాస్ గా కనిపిస్తూనే క్లాస్ లుక్స్ తో మరికొంత మంది అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా మాస్ పాటలను కూడా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన అభిమానులకు ఒక అనుమానం తో కూడిన కన్ఫ్యూజన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తారక్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే.. అయితే ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ ని త్రివిక్రమ్ మరొకసారి ఎన్నుకున్నాడు. అనిరుద్ కూడా ఆ విషయాన్నీ చెప్పాడు. ప్రస్తుతం అనిరుద్ పవన్ 25వ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ అనిరుద్ ఎన్టీఆర్ కి తగ్గట్టు సాంగ్స్ ఇవ్వగలడా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మెలోడీ సాంగ్స్ కి ఒకే.. మాస్ సాంగ్స్ కూడా కొంచెం తన స్టైల్ లో అనిరుద్ ఇస్తాడు. కానీ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ కి మాత్రం ఊర మాస్ లో ఉండే ఒక మంచి బ్యాండ్ సౌండ్ తో కూడిన సాంగ్ ఉంటే గాని సంతృప్తి చెందరు. మన సంగీత దర్శకులకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే తారక్ కోసం ఒక స్పెషల్ సాంగ్ అయినా ఫ్యాన్స్ కి నచ్చినట్లు ట్యూన్ చేస్తారు. మరి అనిరుద్ ని ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు చేస్తాడా ? అని అంటున్నారు. చూడాలి మరి ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా ఇస్తాడో.