Begin typing your search above and press return to search.

10 రోజుల పాటు ఎన్టీఆర్ జంప్

By:  Tupaki Desk   |   31 Aug 2016 7:30 PM GMT
10 రోజుల పాటు ఎన్టీఆర్ జంప్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఫారిన్ లోనే చాలా నెలలు గడిపేసినా.. అది సుకుమార్ సినిమా కావడంతో షూటింగ్ కి చాలానే సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆ సినిమా సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించాక.. కొంచెం కూడా బ్రేక్ తీసుకోకుండా జనతా గ్యారేజ్ స్టార్ట్ చేసేశాడు. అప్పటికే ముహూర్తం పూజ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లాంటివి పూర్తయిపోవడంతో.. పది రోజుల వ్యవధిలోనే గ్యారేజ్ సెట్స్ పైకి వెళ్లిపోయాడు జూనియర్.

రేపు తెల్లారే జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వచ్చేస్తోంది. దీని ప్రమోషన్స్ గట్రా అన్నీ పూర్తి చేసేసి.. ఎన్టీఆర్ ఫారిన్ టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడట. నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయడానికి ముందు కనీసం ఓ నెల్లాళ్లు బ్రేక్ తీసుకోనుండగా.. ఇందులో 10 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో చక్కర్లు కొట్టనున్నాడని టాక్. ఇంతకీ తను చేయబోయే నెక్ట్స్ మూవీ ఇంకా ఫైనల్ కాలేదని ఎన్టీఆర్ చెప్పేశాడు. వక్కంతం వంశీతో సినిమా ఖాయం అంటున్నారు కానీ.. డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని మాత్రమే ఎన్టీఆర్ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు బ్రేక్ కోసం ఫారిన్ జంప్ అయిపోవడం మాత్రం ఖాయం.

అయితే.. ఇలా ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారిన్ టూర్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలంటే.. జనతా గ్యారేజ్ సక్సెస్ కావాల్సి ఉంటుంది. అటూఇటూ అయినా టూర్ లో తేడా రాదు కానీ.. ఎంజాయ్మెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది కదా. అందుకే ఇక్కడ సక్సెస్ వస్తేనే.. ఎన్టీఆర్ అక్కడ ఎంజాయ్ చేయగలడన్న మాట.