Begin typing your search above and press return to search.

ఎన్టీవోడు టాప్-5లో ఎంటరవుతాడా?

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:30 AM GMT
ఎన్టీవోడు టాప్-5లో ఎంటరవుతాడా?
X
ఇప్పుడు టాలీవుడ్ అంతా జనతా గ్యారేజ్ హంగామా నడుస్తోందనడంలో సందేహాలు అక్కర్లేదు. తెల్లారేసరికల్లా ఎన్టీవోడు థియేటర్లలోకి దిగిపోతున్నాడు. ఎప్పుడెప్పుడు జూనియర్ సినిమా చూద్దామా ఆతృతలో అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచేస్తూ.. భారీగా బెనిఫిట్ షోలు కూడా ప్లాన్ చేసేశారు. మరోవైపు బోలెడన్ని థియేటర్లు కూడా జనతా గ్యారేజ్ కోసం బుక్ అయిపోయాయి.

ఒక్క హైద్రాబాద్ లోనే 106 స్క్రీన్ లను జనతా గ్యారేజ్ కు అలాట్ చేశారంటే.. ఎన్టీఆర్ సందడి ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. రీసెంట్ టైమ్ లో అతి భారీ రిలీజ్ అని చెప్పాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సందడి కనిపిస్తోంది. మరి ఇంత భారీగా విడుదల చేస్తున్నారంటే.. రికార్డులపై కూడా కన్నేశారనే అర్ధం చేసేసుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో బాహుబలి (22.4 కోట్లు) - సర్దార్ గబ్బర్ సింగ్ (20.9 కోట్లు) - శ్రీమంతుడు (14 కోట్లు) - బ్రూస్ లీ (12.6 కోట్లు) - (బ్రహ్మోత్సవం 12.4 కోట్లు) టాప్ 5 గా ఉన్నాయి. ఇప్పుడీ రికార్డుపైనే జనతా గ్యారేజ్ కన్నేసింది.

నాన్నకు ప్రేమతో మూవీతోనే టాప్ 5లోకి ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడని అంచనా వేశారు కానీ.. 12.1 కోట్లను మాత్రమే ఆ సినిమా రాబట్టగలిగింది. ఇప్పుడు జనతా గ్యారేజ్ ని రిలీజ్ చేస్తున్న టైమ్.. హైప్ చూస్తుంటే కనీసం టాప్ 3 ప్లేస్ పైన.. కుదిరితే టాప్ ప్లేస్ పైనా కన్నేశాడని చెప్పాల్సిందే. మరి ఏ ప్లేస్ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అవుతాడో తెలియాంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే.