Begin typing your search above and press return to search.

మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్.?

By:  Tupaki Desk   |   12 July 2018 8:48 AM GMT
మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్.?
X
సినిమా.. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ హిట్ అయితేనే పేరు.. ఫ్లాప్ అయితే కనీసం పట్టించుకోరు. అందుకే వెలుగు వెలిగినప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి సినిమా పరిశ్రమలో బలంగా ఉంది. అందుకే తమ చేతిలో సినిమాలు - హిట్స్ ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులను సినీ ప్రముఖులంతా జాగ్రత్తగా పెట్టుబడి పెడుతున్నారు. భూములు - ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ప్రతి టాలీవుడ్ హీరో ప్రత్యామ్మాయ ఆదాయా మార్గాలవైపు దృష్టిసారించారు. నాగార్జున - చిరంజీవి లాంటి వారు వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.

ఈ సీనియర్లే కాదు.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తనకు సినిమాల్లో వచ్చిన డబ్బులతో ఇటవలే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరో కూడా వ్యాపార రంగంలోకి దిగడం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు రూ.20 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ సమాచారం. ఈ మధ్య వరుస హిట్స్ కొడుతున్న తారక్ ఈ డబ్బులతో కొన్ని ఫ్లాట్లు - కమర్షియల్ బిల్డింగ్ లను కొనుగోలు చేశాడు. కానీ ఇప్పటివరకూ వ్యాపారరంగంపై దృష్టిసారించ లేదు. తాజాగా జూనియర్ మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి దిగినట్లు సమాచారం.

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలా థియేటర్లు నిర్మించి ఈ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు బడా నిర్మాత సురేష్ బాబు. ఆయన చేతిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి. ఈ వ్యాపారంపై స్థూలంగా తెలుసుకున్న ఎన్టీఆర్.. దీంట్లో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యారు.

ఈ నందమూరి హీరో త్వరలోనే కార్పొరేట్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగబోతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించడానికి ఎన్టీఆర్ సన్నిహితులు నిరాకరించారు. అయితే ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.