తారక్ ఎమోషనల్ అయ్యాడే!!

Mon May 21 2018 16:57:44 GMT+0530 (IST)

టాలీవుడ్ లో మన స్టార్ హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే చాలు సంతోషంగా ఎక్కువగా సెలబ్రేట్ చేసేది అభిమానులే. హీరో లేకున్నా మంచి మంచి కార్యక్రమాలతో బర్త్ డే సెలబ్రేట్ చేయడం అభిమానులకు అలవాటే. నిన్న ఎన్టీఆర్ బర్త్ డే కు కూడా ఫ్యాన్స్ అదే స్థాయిలో ఎంజాయ్ చేశారు. రక్త దానం అన్నదానం అంటూ మంచి మంచి కార్యక్రమాలతో తారక్ కి గుర్తుండిపోయే విషెస్ ని అందించారు.మెయిన్ గా త్రివిక్రమ్ తారక్ పుట్టిన రోజు సందర్బంగా అదిరిపోయే స్టిల్ రిలీజ్ చేయడం  అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంది. పుట్టిన రోజుకు మంచి ఆనందాన్ని ఇచ్చారు అని సోషల్ మీడియాలో తారక్ కి భారీ స్థాయిలో విషెస్ అందించారు. అయితే అభిమానుల ప్రేమకు తారక్ ఎమోషనల్ అయ్యాడు. ఈ ఆనంద క్షణాలను ఎప్పటికి మరచిపోలేను అని స్వీటుగా ట్వీట్ చేశాడు. అరవింద సమేత వీర రాఘవ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ బావుంది అంటూ.. ఇంతకు మించి ఎక్కువ కోరుకోలేను అన్నాడు.

అంతే కాకుండా  35 ఏళ్ల జీవితంలో 18 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో గెలుపోటములు చూశాను. కానీ మీ అభిమానం ప్రేమ మాత్రం స్థిరంగా ఉంది. దానికి నేను వేల కట్టలేను తిరిగి ఇవ్వలేను అని చెబుతూ.. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. సోషల్ మీడియా ద్వారా తారక్  అభిమానులకు ఈ రేంజ్ లో కృతజ్ఞతలు చెప్పడం ఇదే మొదటి సరి. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తారక్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.