తారక్ బర్త్ డే.. స్పెషల్ కిక్

Thu May 17 2018 22:17:03 GMT+0530 (IST)

చాప క్రింద నీరులా.. త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చాలా స్పీడ్ గా సాగుతోంది. మొన్నటికి మొన్న స్టార్ట్ చేశారు అనుకునే లోపే నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ కూడా పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సారి తన అసలైన టాలెంట్ ని చూపిస్తాడు అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ న్యూస్ ఇస్తుందని అందరూ ఉహించే ఉంటారు.అయితే అభిమానులు ఊహించిన దానికంటే చిత్ర యూనిట్ బోనస్ కిక్ ని ఇవ్వనున్నారు. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికి తెలిసిందే. అయితే దానికంటే ఒక రోజు ముందే అనగా మే 19న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నట్లు త్రివిక్రమ్ గ్యాంగ్ అధికారికంగా తెలిపింది. అందులోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఉంటుందని కూడా టాక్ వస్తోంది. దాని కోసమే అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.

ఇక సినిమాకి అసామాన్యుడు అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు ఇటీవల కాలంలో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రూమర్ పై చిత్ర యూనిట్ పెద్దగా స్పందించలేదు. దీంతో అదే అయ్యి ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాను హారిక హాసిని ప్రొడక్షన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా రంభ కీలక పాత్రలో నటిస్తుందని రూమర్ వస్తోంది. ఇక థమన్ సంగీతం అందిస్తున్నాడు.