Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అంచనా అక్కడే మిస్ అయ్యింది

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:30 PM GMT
ఎన్టీఆర్ అంచనా అక్కడే మిస్ అయ్యింది
X
ఆశ్చర్యకరంగా ఎన్టీఆర్ కథానాయకుడు ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా రివ్యూలు బాగా వచ్చినా వసూళ్లు మాత్రం రికార్డులు సృష్టించేలా లేకపోవడం నందమూరి అభిమానులకు అంతు చిక్కడం లేదు. డ్రాప్ ఉండటం ఏ సినిమాకైనా సహజమే అయినా పండగ సీజన్ కు అది వర్తించదు కాబట్టి పది రోజులు స్ట్రాంగ్ గా తగ్గకుండా నిలుస్తుందని ట్రేడ్ కూడా ఆశించింది. అయితే అనూహ్యంగా డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి కానీ అంతకు మించి విశేషాలు నమోదు కావడం లేదు . అయితే దీనికి కారణాలు లేకపోలేదు.

ఎన్టీఆర్ ను రెండు భాగాలుగా ప్రకటించినప్పటి నుంచి చాలా పరిణామాలు జరిగాయి. సినిమాలో చూపించిన ఎన్టీఆర్ జీవితం దాదాపు బయట అందరికి తెలిసిందే. ఇందులో ఆశ్చర్యపోయే నిజాలు కాని సంఘటనలు కాని ఏవి చూపలేదు. అంతా సాఫీగా నడిచిపోయింది. సహజంగానే డ్రామా లేకుండా పోయింది. దానికి తోడు బాలకృష్ణ అందులోనూ చంద్రబాబు నాయుడు వియ్యంకుడు సినిమా కాబట్టి మహానాయకుడులో వాస్తవాలు చూపుతారో లేదో అనే ప్రచారం చాలా గట్టిగా జరిగింది. అలా చూపడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఎందుకు చూడాలి అనే నిర్లిప్తత ఓ వర్గంలో రావడానికి ఈ ప్రచారం తోడ్పడింది.

దానికి తోడు ఇలా రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్ట్ లో ఎన్టీఆర్ బయోపిక్ తీసి మూడు గంటల్లో రెండు గంటలు సినిమా జీవితం చివరి గంట రాజకీయ ప్రస్థానం కవర్ చేసుంటే ఓ రేంజ్ లో జనం దీనికి బ్రహ్మరధం పట్టేవారన్న కామెంట్ నిజమే అనిపిస్తుంది. బిజినెస్ కోసం వేసిన టూ పార్ట్ సీక్వెల్ ఫైనల్ గా ఆశించిన ఫలితం ఇవ్వనట్టే కనిపిస్తోంది. ఇప్పుడు నాలుగు సినిమాల ఫలితాలు వచ్చాయి. అందులోనూ వినయ విధేయ రామ ప్రతికూల ఫలితం అందుకుంది కాబట్టి ఎన్టీఆర్ కథానాయకుడు దీన్ని ఎంత మేరకు వాడుకుంటాడో వేచి చూడాలి