Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఇంట్లో 'ఎన్టీఆర్'!

By:  Tupaki Desk   |   16 Aug 2018 4:43 PM GMT
ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్!
X
విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్టీఆర్ `బ‌యోపిక్ ను బాల‌కృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో ఈ బ‌యోపిక్ ను నిల‌పాల‌ని బాల‌య్య కృత నిశ్చ‌యంతో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం షూటింగ్ ఎన్టీఆర్ నివ‌సించిన ఇంట్లో చిత్రీక‌రిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అబిడ్స్ లో ఎన్టీఆర్ నివ‌సించిన‌ ఇంట్లో ఎన్టీఆర్-బసవరామతారకం-చంద్రబాబు నాయుడుల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను క్రిష్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్య -విద్యాబాలన్-రానాలతో పాటు మ‌రికొంద‌రు పాల్గొంటున్నారట‌. అయితే, నేడు జ‌రిగిన షూటింగ్ లో హ‌రికృష్ణ పాత్ర‌ధారి క‌ల్యాణ్ రామ్ పాల్గొన‌లేద‌ని తెలుస్తోంది.

అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రంలో న‌టీన‌టుల‌ను క్రిష్ ఏరికోరి ఎంచుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆ బ‌యోపిక్ లో కీల‌క‌మైన హ‌రికృష్ణ పాత్ర కోసం క‌ల్యాణ్ రామ్ కు మేక‌ప్ టెస్ట్ చేశార‌ట‌. అయితే, నేడు చిత్రీక‌రించిన సన్నివేశాల సంద‌ర్భంగా నంద‌మూరి హరికృష్ణ ప్ర‌స్తావ‌న ఎపుడూ రాలేదు. ఒక‌వేళ హ‌రికృష్ణ పాత్ర‌ను చైతన్య రథం సీన్లకే పరిమితం చేయాల‌ని క్రిష్ ప్లాన్ చేస్తున్నారేమోన‌ని టాక్ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు హ‌రికృష్ణ ఫ్యామిలీ దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ `ఎన్టీఆర్ ` లో న‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు, బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తుండ‌గా... శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆరేసుకోబోయి....పాట కోసం జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో రాశిఖ‌న్నాను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది.