Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్‌' ప్రీ రిలీజ్‌ వేడుక అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 10:44 AM GMT
ఎన్టీఆర్‌ ప్రీ రిలీజ్‌ వేడుక అప్‌ డేట్‌
X
‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ లో క్రిష్‌ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. టైటిల్‌ రోల్‌ లో బాలకృష్ణ నటిస్తుండగా, బసవతారకం పాత్రను విద్యాబాలన్‌ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ఈ చిత్రంలో పలు పాత్రలకు గాను టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ ను ఎంపిక చేయడం జరిగింది. సినిమాపై అంచనాలు పెంచేలా దర్శకుడు క్రిష్‌ ప్రతి పాత్రను చాలా విభిన్నంగా తీర్చి దిద్దుతున్నాడు. ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెండు పార్ట్‌ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

డిసెంబర్‌ 16న తిరుపతిలో భారీ ఎత్తున ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం అప్పుడే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బాలకృష్ణ, విద్యాబాలన్‌, చంద్రబాబు నాయుడు, రానా, సుమంత్‌ ఇంకా పలువురు సినీ ప్రముఖులు అంతా కూడా వేడుకలో పాల్గొనబోతున్నారు.

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రం జనవరి 9న సంక్రాంతి సందర్బంగా, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ జనవరి 24న రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేసేందుకు క్రిష్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వంద కోట్ల బిజినెస్‌ ఇప్పటికే ఈ చిత్రం చేసినట్లుగా చెబుతున్నారు.