Begin typing your search above and press return to search.

అసలు ఇది ఎవరి బయోపిక్..?

By:  Tupaki Desk   |   23 Feb 2019 6:53 AM GMT
అసలు ఇది ఎవరి బయోపిక్..?
X
ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'ఎన్టీఆర్ మహానాయకుడు' శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ రివ్యూస్.. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చర్చలు సాగుతున్నాయి. కొందరు సెటైర్లు.. జోకులతో సరిపెడుతుంటే మరికొందరు ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు.

ఎన్టీఆర్ బయోపిక్ నిజానికి మూడు భాగాలని.. మొదటి రెండు భాగాలు క్రిష్ తెరకెక్కిస్తే మూడో భాగానికి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడని పంచ్ లు పడుతున్నాయి. ఇదే కాదు.. ఒక బయోపిక్ లో ఒకరి గురించి ప్రధానంగా ఉంటుందని కానీ.. ఇదేం విచిత్రమో దాల్ మిక్చర్ లాగా ముగ్గురి బయోపిక్ అని సెటైర్ వేస్తున్నారు. పేరుకు ఎన్టీఆర్ బయోపిక్ అయినా.. బసవతారకం బయోపిక్.. చంద్రబాబు నాయుడు బయోపిక్ లు కూడా బంపర్ ఆఫర్ లాగా ప్రేక్షకులకు చూపించారని అంటున్నారు. ఫ్యూచర్ లో త్రీ ఇన్ వన్ బయోపిక్ లకు ఇది కేస్ స్టడీలాగా వాడొచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ సపోర్టర్లు కొందరు.. "అలా ఎలా అంటారు.. బసవతారకం గారి పూర్తి కథ.. చంద్రబాబు పూర్తి కథ చూపించలేదు కదా?" అని ప్రశ్నిస్తే.. "ఎన్టీఆర్ పూర్తి కథ ఏమైనా చూపించారా?" తిరిగి కౌంటర్ వేస్తున్నారు.

ఏదైతేనేం.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఒక హాట్ టాపిక్. ఇప్పట్లో ఇంతకు మించిన హాట్ టాపిక్ లేదు. ఈ చర్చలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాలంటే వర్మగారి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ కావాల్సిందే.