Begin typing your search above and press return to search.

ఆడియో రిలీజ్ పోస్టర్లో అన్నగారు!

By:  Tupaki Desk   |   16 Dec 2018 4:04 AM GMT
ఆడియో రిలీజ్ పోస్టర్లో అన్నగారు!
X
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ డిసెంబర్ 16 న హైదరాబాద్ లో జరుగుతుందని.. నిమ్మకూరు లో డిసెంబర్ 21 న ట్రైలర్ లాంచ్ జరుగుందని ఈమధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్లాన్ మారింది.

ఆడియో లాంచ్.. ట్రైలర్ రిలీజ్ రెండూ ఒకేరోజున డిసెంబర్ 21 వ తేదీన చేస్తామని ఎన్టీఆర్ టీం ఈరోజు ప్రకటించారు. ఈ విషయాన్ని కన్ఫాం చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అన్నగారి గెటప్ లో బాలయ్య యమా స్టైలిష్ గా ఉన్నాడు. రెట్రో స్టైల్లో పెద్ద కాలర్ ఉండే షర్టు.. వైట్ పంచె తో ఓల్డ్ సినిమా కెమెరా మీద చెయ్యి పెట్టి నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్లో ఆడియో ఈవెంట్ లొకేషన్.. వెన్యూ మాత్రం కన్ఫాం చేయలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ కథానాయకుడు'.. 'ఎన్టీఆర్ మహానాయకుడు' అని రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం జనవరి 9 వ తారీఖున విడుదల అవుతోంది. రెండో భాగం 'మహానాయకుడు' విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.