స్మాల్ స్క్రీన్ బిగ్ బాస్ ఇరగదీశాడుగా

Sun Jun 18 2017 10:20:39 GMT+0530 (IST)

బిగ్ బాస్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి విపరీతమైన చర్చలు జరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సెన్సేషన్స్ సృష్టించిన ఈ కార్యక్రమానికి.. లోకల్ వెర్షన్స్ ను కూడా సిద్ధం చేయడం.. తెలుగులో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక చేయడంతోనే.. ఇక్కడ ఈ ప్రోగ్రాంపై హైప్ పెరిగిపోయింది.

స్మాల్ స్క్రీన్ పై వచ్చే కార్యక్రమమే అయినా.. భారీ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. మొదటగా ఇచ్చిన బిగ్ బాస్ ఫస్ట్ లుక్ లో కన్నుగీటుతూ ఆకట్టుకున్న యంగ్ టైగర్.. ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమోతో ఇరగదీసేశాడని చెప్పచ్చు. స్టార్ మా వంటి ఛానల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కావడంతో హైక్వాలిటీ గ్రాఫిక్స్ ను జోడించారు. మొదట షాడో మాదిరిగా కనిపించే ఎన్టీఆర్ సిల్హౌట్.. పక్కనే ఇద్దరు అమ్మాయిలు.. ఎన్టీఆర్ ను తాకగానే ఫైర్ ఎఫెక్ట్స్.. వీటన్నిటితో పాటు అదిరిపోయే రేంజ్ లో ఉన్న జేమ్స్ బాండ్ థీమ్ టైపులో మ్యూజిక్ తో ప్రోమో సూపర్బ్ గా ఉంది.

చివర్లో ఫుల్ ప్లెడ్జెడ్ గా దర్శనం ఇచ్చిన జూనియర్ కోట్ బటన్ పెట్టుకుంటూ ప్రోమోకు ఫినిషింగ్ ఇచ్చిన తీరు అదరహో అనాల్సిందే. ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ భారీ మొత్తం తీసుకుంటున్నాడనే టాక్ పక్కన పెడితే.. ఎన్టీఆర్ ను తీసుకోవడమే బిగ్ బాస్ కు పెద్ద అసెట్ అనడంలో సందేహం అక్కర్లేదు.