ఎన్టీఆర్ తో ఆటాడేది వీరే

Sun Jul 16 2017 14:59:03 GMT+0530 (IST)

ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగులో వచ్చేస్తోంది. సహజంగా షో ప్రారంభమయ్యాక అందులో తలెత్తే వివాదాల కారణంగా ఫేమ్ లోకి రావడం.. ఇంట్రెస్ట్ క్రియేట్ కావడం.. టీఆర్పీలు పెరగడం వంటివి బిగ్ బాస్ కు ఆనవాయితీ. కానీ తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి హోస్ట్ పేరు చెప్పగానే ఆసక్తి పెరిగిపోయింది. అయితే.. ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ ఎవరనే విషయం ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. డజన్ మంది 70 రోజుల పాటు ఒకే హౌస్ లో ఉండాల్సి వచ్చే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే వ్యక్తులపై ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ తెలుస్తున్నాయి.

పార్టిసిపెంట్స్ ఎవరో తనకు కూడా తెలీదంటూ ఎన్టీఆర్ కాస్త డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చినా.. చాలామంది పేర్లు రివీల్ అయిపోయాయి. శివబాలాజీ...ధన్ రాజ్.. ఆదర్శ్.. సంపూర్ణేష్ బాబు.. మహేష్ కత్తి.. సమీర్ ...హీరో ప్రిన్స్  లు మేల్ పార్టిసిపెంట్స్ కాగా.. ముమైత్ ఖాన్.. కత్తి కార్తీక .. అర్చన.. మధుప్రియ.. కల్పన.. జ్యోతి.. హరితేజలు బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ అన్నది లేటెస్ట్ గా తెలుస్తున్న వివరాలు.

7 మంది మేల్ పార్టిసిపెంట్స్.. మరో 7 లేడీ పార్టిసిపెంట్స్ తో.. బాగా సమతూకం పాటించారనే సంగతి అర్ధమవుతోంది. అయితే.. ఈ 14 మంది నిజంగా ఆ కార్యక్రమంలో ఉన్నారా లేదా అనే విషయం తెలియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇవాళ రాత్రి 9 గంటలకు తెలుగు బిగ్ బాస్ సీజన్ కానుండడంతో.. తొలి రోజు ఈ కార్యక్రమానికి రికార్డు టీఆర్పీలు వస్తాయని అంచనాలున్నాయి.