బ్యాక్ టు యమదొంగ

Fri Jan 12 2018 17:06:41 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ తొలినాళ్ళలో చేసిన సినిమాలలో అందరికి బాగా గుర్తుండిపోయేది బొద్దుగా ఉండే అతని రూపం. ఆది - సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో కూడా అదే లుక్ క్యారి చేసిన తారక్ ఇలాగే ఉంటే కష్టమని గుర్తించి అందరు ఆశ్చర్యపోయేలా ఒళ్ళు తగ్గించుకుని మరీ స్లిమ్ లుక్ లోకి మారిపోవడం కంత్రి - యమదొంగ సినిమాల నుంచి మొదలైంది. ఎముకల గూడులాగా తన దేహాన్ని మార్చుకున్న తీరు చూసి అందరు ఆశ్చర్యపోయారు. టెంపర్ - జనతా గ్యారేజ్ లో కొంచెం ఒళ్ళు చేసినట్టు కనిపించిన తారక్ జై లవకుశలో కూడా అలాగే కంటిన్యూ అయ్యాడు. కాని అభిమానులకు థ్రిల్ ఇచ్చే న్యూస్ ఏంటంటే తారక్ మరోసారి పూర్తిగా తన బరువు తగ్గించుకుని న్యూ యంగ్ లుక్ లోకి మారిపోయాడట. అతనితో రెగ్యులర్ టచ్ లో ఉన్న వాళ్ళు - ఫ్రెండ్స్ మాత్రమే తనను ఇలా చూసే ఛాన్స్ కొట్టేయడంతో వాళ్ళు బయటికి వచ్చి చెబుతున్న టాక్ ఇది.తారక్ త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. దాని కోసమే ఈ మార్పు అని వార్త. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టొరీ దీని కోసం సిద్ధంగా ఉంచుకున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసి ఊహించని షాక్ ఇవ్వడంతో స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోలేదు. ఒక్క సినిమాతో ఏ దర్శకుడి ప్రతిభ తగ్గడం మసకబారడం జరగదు కనక కొద్ది రోజులయ్యాక అంత నార్మల్ అయిపోతుంది. తారక్ సినిమా ఎప్పటి నుంచి రెగ్యులర్ సెట్స్ పైకి వెళ్తుంది అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు.

వీలైనంత తక్కువ టైంలోనే షూటింగ్ ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నారట. త్రివిక్రమ్ ఇప్పుడు టెక్నికల్ టీం - హీరొయిన్ సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది. అజ్ఞాతవాసికి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ పట్ల ఫీడ్ బ్యాక్ ఏమంత పాజిటివ్ లేకపోవడంతో ఎన్టీఆర్ మూవీకి ఎవరిని తీసుకుంటారా అని ఆసక్తిగా మారింది. ఫాన్స్ మాత్రం సన్నబడిన ఎన్టీఆర్ ను చూడాలని ఆత్రుతగా ఉన్నారు.