Begin typing your search above and press return to search.

ఆరో రోజు కలెక్షన్స్.. డల్లయిన అరవింద

By:  Tupaki Desk   |   17 Oct 2018 10:05 AM GMT
ఆరో రోజు కలెక్షన్స్.. డల్లయిన అరవింద
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' విడుదలై ఇప్పటికే ఆరు రోజులయింది. ఓపెనింగ్ కలెక్షన్స్ దుమ్ముదులిపినా సోమవారం నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర 'అరవింద సమేత' డల్ అయిందన్నది మాత్రం వాస్తవం. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.55 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'అరవింద సమేత' మంగళవారం నాడు ఇంకా తక్కువగా 2.9 కోట్లు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల టోటల్ కలెక్షన్స్ కు జోడించడం కాస్త ఇబ్బందికరమైన పరిణామమే.

రూ.90 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ కు అమ్మడం జరిగింది కాబట్టి ఇలాంటి డైలీ కలెక్షన్ ఫిగర్స్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడం దాదాపుగా అసాధ్యం. సాధారణ వీక్ డేస్ లో ఈ కలెక్షన్స్ అంటే సరిపెట్టుకోవచ్చుగానీ ఇవి దసరా హాలిడేస్.. పైగా కాంపిటీషన్ లో మరో సినిమా లేదు కాబట్టి సినిమా కలెక్షన్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే లెక్క. ఇదిలా ఉంటే రేపటినుండి 'పందెం కోడి-2' లాంటి మాస్ సినిమా 'హలో గురూ ప్రేమ కోసమే' లాంటి యూత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికే వీక్ అయిన 'అరవింద సమేత' కు మరింత ఇబ్బంది కరంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. ఇదంతా నెగెటివిటీ.. అని పెదవివిరిచే వాళ్ళకు ఉన్న ఆశాకిరణం మాత్రం పండగలో ముఖ్యమైన మూడు రోజులు మిగిలి ఉండడమే. ఈ మూడు రోజులు 'అరవింద సమేత' రిజల్ట్ ను అటో ఇటో తేల్చేస్తాయి.

'అరవింద సమేత' ఆరు రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం - 15.90 cr

సీడెడ్ - 12.48 cr

ఉత్తరాంధ్ర - 6.26 cr

ఈస్ట్ - 4.51 cr

వెస్ట్ - 3.73 cr

కృష్ణ - 3.99 cr

గుంటూరు - 6.60 cr

నెల్లూరు - 2.08 cr

Total - Rs 55.55 cr (ఏపీ + తెలంగాణా 6 రోజుల షేర్)