Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు.. ధడ్కన్?

By:  Tupaki Desk   |   27 Aug 2016 5:30 PM GMT
ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు.. ధడ్కన్?
X

మరో నాలుగు రోజుల్లో యంగ్ టైగర్ కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ఈ సినిమాపై చాలానే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా కూడా సిద్ధమైందనే టాక్ ఉంది. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాకి సిద్ధమైపోతున్నాడు.

రైటర్ వక్కంతం వంశీని తొలిసారిగా దర్శకుడిగా పరిచయం చేయనున్నాడు ఎన్టీఆర్. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రానికి.. ఇప్పుడు 'ధడ్కన్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ స్టోరీకి.. ధడ్కన్ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారని సమాచారం. టైటిల్ విషయంలో ఇంకా ఫైనలైజ్ చేయకపోయినా.. ఇప్పటికే ఎన్టీఆర్ కి కూడా చెప్పారని.. యంగ్ టైగర్ కూడా ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. మరోవైపు నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా.. ధడ్కన్ టైటిల్ కే మొగ్గుతున్నాడని టాక్.

ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తే.. మూవీ స్టార్టింగ్ లోపే టైటిల్ చెప్పి షూటింగ్ మొదలుపెడతారని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రాన్ని.. 2017 ప్రథమార్ధంలోనే విడుదల చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.