Begin typing your search above and press return to search.

తారక్ అండ్ త్రివిక్రమ్.. యాక్షన్

By:  Tupaki Desk   |   25 April 2018 6:53 AM GMT
తారక్ అండ్ త్రివిక్రమ్.. యాక్షన్
X
జై లవ కుశ హిట్ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని తారక్ బాగా కష్టపడుతున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఆజ్ఞతవాసి ద్వారా పడిన మచ్చని ఈ సినిమాతో తొలగించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే స్క్రిప్ట్ విషయంలో చాలా హోమ్ వర్క్ చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ కి తగ్గట్టుగా ఎక్కడా ప్లాన్స్ తారుమరవ్వకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో హై వోల్టేజ్ ఫైట్ సీన్ ను స్టార్ట్ చేశారు. త్రివిక్రమ్ సినిమాల్లో కథ పరంగా వచ్చే యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు కూడా అంతకు మించి ఉంటాయని సినిమాలో అదే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ నెల 26వరకు ఆ ఫైట్ సీక్వెన్స్ కొనసాగుతుందట. ఇందులో తారక్ తన సరికొత్త సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకొనున్నాడు. గతంలో వర్కౌట్స్ చేస్తూన్న కొన్ని ఫొటోలు బయటపడిన సంగతి తెలిసిందే.

ఆ ఫిట్ నెస్ కోసం నిజంగా చాలా కష్టపడ్డారనే చెప్పాలి. ఇక మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 26వరకు కొనసాగించి కొంచెం బ్రేక్ తీసుకున్న తరువాత మే 3న మళ్లీ మొదలు పెట్టనున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.