Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌.. సుక్కూ.. జగ్రత్త పడ్డారా??

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:06 PM GMT
ఎన్టీఆర్‌.. సుక్కూ.. జగ్రత్త పడ్డారా??
X
స్ర్టయిట్‌ గా పాయింట్ లోకి వచ్చేస్తే .. బ్లాక్‌ బస్టర్‌ అని సర్టిఫికేట్‌ పొందిన టెంపర్‌ షుమారు 43 కోట్లతో సెటిలైందంతే. అయితే ఆ సినిమాను అంతకంటే ఓ కోటిన్నర ఎక్కువకే అమ్మాడు బండ్ల గణేష్‌. సరిగ్గా అదే విషయంలో ఆయనకూ సచిన్‌ జోషీకి ఏకంగా ట్విట్టర్‌ లో పబ్లిక్‌ గా తిట్టుకునే స్థాయికి గొడవలు వెళ్ళిపోయాయ్‌. సర్లేండి.. అది ముగిసిన దుకాణం. ఇప్పుడు మనం లండన్‌ వెళదాం...

అసలు ఏదో సరదాగా ఓ 10 రోజులు లండన్‌ లో షూట్‌ చేస్తేనే ఏకంగా 70 కోట్ల రేంజులో వచ్చేసింది మహేష్‌ బాబు 1 నేనొక్కడినే బడ్జెట్‌. కాని అప్పుడు లండన్‌ తో ఏమి అబ్సెషన్‌ కు గురయ్యాడో తెలియదు కాని, ఇప్పుడేకంగా ఎన్టీఆర్‌ సినిమా మొత్తం అక్కడే తీస్తున్నాడు గురుడు సుకుమార్‌. ఇకపోతే ఈ మధ్యనే ఓ రిచ్‌ ఆఫీస్‌ సెట్‌ కోసం లండన్‌ నగరంలోని ఓ 26వ అంతస్తులో 60 లక్షలతో సెట్టేశాడని చెప్పకున్నాంగా.. ఆ సెట్‌ దగ్గరకు వెళితే.. ఆ సెట్‌ ఇండియాలో కూడా వేసి.. అలా విండోస్ దగ్గర గ్రీన్‌ స్ర్కీన్‌ అమర్చి.. విజువల్‌ ఎఫెక్ట్సులో అక్కడ లండన్‌ నగరం స్కై లైన్‌ తో రీప్లేస్‌ చేస్తే.. సీన్‌ సెట్టవ్వుద్ది. పెద్ద పెద్ద జేమ్స్‌ బాండ్‌ సినిమాలకు సైతం అలాగే చేస్తున్నారు. అయితే మనోళ్లు మాత్రం అథెంటిక్‌ లుక్‌ కోసం అక్కడే సెట్టేశారట. అథెంటిసిటీ ఏమో కాని బడ్జెట్‌ తడసి మోపెడు కావట్లేదా? నిర్మాత బివిఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ ఈ విషయంలో ఏదైనా జాగ్రత్త తీసుకున్నారా?

దానికంటే ముఖ్యంగా అసలు ఎన్టీఆర్‌, సుకుమార్‌ జాగ్రత్త పడుతున్నారా? లేకపోతే సినిమా హిట్టయినా కూడా లాభాలు రాని పరిస్థతి.. నిర్మాతంటే శాటిలైట్‌ నుండి డబ్బింగ్‌ రైట్ల వరకు అన్నీ అమ్ముకుని ఏదో విధంగా గట్టెక్కేస్తాడు.. కాని పంపిణీదారుల పరిస్థతి ఏంటి సార్‌? బాహుబలి, శ్రీమంతుడు తప్పించి.. వాళ్లకు ఈ మధ్య కాలంలో ఏ హిట్టు సినిమా కూడా లాభాలే కురిపంచలేదంటే అతిశయోక్తి కాదు.