Begin typing your search above and press return to search.

తారక్ చరణ్ ల స్టేటస్ ఇది

By:  Tupaki Desk   |   16 Sep 2019 11:13 AM GMT
తారక్ చరణ్ ల స్టేటస్ ఇది
X
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బల్గెరియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశాడు. రిసీవ్ చేసుకోవడానికి భార్య ప్రణతి వెళ్లగా వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. వెనుక నుంచి తీసినవి కావడంతో స్పష్టత లేకపోయినా క్యాజువల్స్ లో ఉన్న భార్యాభర్తలను చూసి అభిమానులు వెంటనే గుర్తు పట్టేశారు.

తాను పోషిస్తున్న కొమరం భీం తాలూకు సీన్స్ కోసం బల్గెరియాకు ఒక్కడే వెళ్లిన తారక్ అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్నట్టు తెలిసింది. జూనియర్ కెరీర్ లోనే టెర్రిఫిక్ అనిపించే ఇంట్రో ఎపిసోడ్ ఇందులో ఉంటుందట. కేవలం ఈ బ్లాక్ కోసమే కోట్లాది రూపాయల బడ్జెట్ ఖర్చయినట్టుగా తెలిసింది

ఇక మరో హీరో రామ్ చరణ్ అతి త్వరలోనే తన పార్ట్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది హైదరాబాద్ లోనే కంటిన్యూ కానుంది. కొన్ని సోలో సీన్స్ షూట్ చేశాక మళ్ళీ కాంబో సీన్స్ తెరకెక్కిస్తారు. ఒకవైపు సైరా ప్రీ రిలీజ్ తాలూకు ప్రమోషన్ లో చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. మరోవైపు వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసే ఒత్తిడి రాజమౌళి మీద ఉంది.

ఈ నేపథ్యంలో చరణ్ కు ఇవి బాలన్స్ చేయడం కత్తి మీద సామే. అసలే ప్రీ రిలీజ్ వాయిదా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది నిజమైతే ప్రెజర్ ఇంకాస్త ఎక్కువవుతుంది. పైగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రమోట్ చేయాల్సిన ప్లానింగ్ కూడా జరుగుతోంది. మొత్తానికి ఇద్దరు హీరోలు సిటీలోనే ఉన్నారన్న క్లారిటీ అయితే వచ్చేసింది