రైల్వే స్టేషన్లో అరవింద - వీర రాఘవ

Sat Aug 11 2018 10:26:06 GMT+0530 (IST)

రైల్వే స్టేషన్.. ఈ లొకేషన్లోనే ఓ తెలియని బ్యూటీ ఉంటుంది.  కంపుగొట్టే ఎన్విరాన్మెంట్ లో బ్యూటీ ఎక్కడుందని మీరు కోప్పడనవసరం లేదు. ఎందుకంటే మీరక్కడ నిలబడితే కదా కంపు.. అదే ఆ లొకేషన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూస్తె మాత్రం ఇంపు.  ఆ ఇంపు కు ఒంపు సొంపుల అరవింద తోడైతే.. ఆమెకు పక్కన సీమ కుర్రాడు వీర రాఘవుడుంటే?అబ్బా ఆలోచిస్తేనే అదేదో బ్లాక్ బస్టర్ సినిమాలో క్లాసిక్ రైల్వే స్టేషన్ సీన్ లా అనిపించడం లేదూ. అందుకే అరవింద - వీర రాఘవల కోసం గురూజీ అక్కడ షూటింగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. ఆ లొకేషన్ నుండి ఫోటో లు బయటకు వచ్చాయి.  ఒక ఫోటోలో పూజా హెగ్డే షాట్ గాప్ లో ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని దీర్ఘాలోచనలో ఎక్కడికో వెళ్ళినట్టుగా ఉంది. పక్కన సీన్ పేపర్ తో అసిస్టెంట్ డైరెక్టర్.. ఆ పక్కన 'అరవింద సమేత' క్రూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.

మరో ఫోటోలో ఎన్టీఆర్ - పూజా లు బెంచీ పై కూర్చున్నారు. బెంచీ వెనకున్న త్రివిక్రమ్ సీన్ ను వివరిస్తూ ఉంటే ఎన్టీఆర్ అది శ్రద్దగా వింటున్నాడు పూజా ఒక బ్రైట్ స్మైల్ తో చూస్తూ ఉంది.  మరి మన గురూజీ ఏం సీన్ ప్లాన్ చేసినట్టో... ఎమోషనల్ లవ్ సీనా లేక రచ్చగా ఉండే ఫైట్ కు ముందు రాబోయే క్యాజువల్ సీనా? గురూజీ ఎలాంటి సీన్ ప్లాన్ చేసినా రైల్వే స్టేషన్ సెటప్ లో మన తారక్ రెచ్చిపోవడం ఖాయం.