Begin typing your search above and press return to search.

వినాయక చవితికి నందమూరి ట్రీట్‌

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:24 PM GMT
వినాయక చవితికి నందమూరి ట్రీట్‌
X
ఈసారి వినాయక చవితి బాబాయ్‌- అబ్బాయ్‌ లదే. నటసింహా బాలయ్య, జూ.ఎన్టీఆర్‌ ఇద్దరూ పండగ వేళ సెలబ్రేషన్స్‌ కి రెడీ అవుతున్నారు. అందుకే బొజ్జ గణేషుని పండక్కి నందమూరి అభిమానులకు కన్నుల పండుగే. బాలయ్యబాబు 99వ సినిమా డిక్టేటర్‌ సాంగ్‌ టీజర్‌ ని సెప్టెంబర్‌ లో వినాయక చవితి కానుకగా రిలీజ్‌ చేస్తున్నారు. బాలయ్య కోసం ఇటీవలే చిత్రపురి కాలనీలో వినాయక చవితి సాంగ్‌ ని తెరకెక్కించారు. ఈ పాటను గణేషునికి కానుకగా లాంచ్‌ చేయాలన్నది ప్లాన్‌. సెప్టెంబర్‌ 17 వేకువ ఝామునే పాటని రిలీజ్‌ చేస్తారుట.

మరో వైపు ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో టైటిల్‌ లోగోని కూడా సేమ్‌ డే రిలీజ్‌ చేయాలన్నది ప్లాన్‌. ఇప్పటికే బాబాయ్‌- అబ్బాయ్‌ ఇద్దరూ కూడబలుక్కున్నట్టు విదేశాల్లోనే షూటింగులు పెట్టుకున్నారు. వాటిని పూర్తి చేసుకుని లోకల్‌ గా అడుగుపెట్టి వినాయక చవితి సంబరాల్ని చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి కంటెంట్‌ పరంగానూ అబ్బాయ్‌ కి పోటీగా బాబాయ్‌ దుమ్ము దులిపేస్తాడనే అనుకుంటున్నారు. లౌక్యంతో ఊపుమీదున్న శ్రీవాస్‌ బాలయ్యను కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు తపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్‌ న్యూలుక్‌ తో ఇప్పటికే పరేషాన్‌ చేశాడు. సుక్కూలోని మరో కొత్త యాంగిల్‌ ఈసారి కనిపిస్తోంది. పండగ వరకూ కాస్త ఓపిక పట్టండి ప్లీజ్‌.