Begin typing your search above and press return to search.

సుక్కుకి సాయం.. బరువు కాదు బాధ్యత

By:  Tupaki Desk   |   22 May 2017 4:55 AM GMT
సుక్కుకి సాయం.. బరువు కాదు బాధ్యత
X
ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్- సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు సుకుమార్ రైటింగ్స్ లో రెండో సినిమా నిర్మాణం పూర్తి చేసేశాడు. దర్శకుడు టైటిల్ పై తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ వర్క్స్ ప్రారంభమయ్యాయి.

నిన్న టీజర్ లాంఛ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా స్టార్ట్ చేశాడు సుకుమార్. ఈ టీజర్ లాంఛింగ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఎన్టీఆర్ చేతులమీదుగా టీజర్ ను లాంఛ్ చేయించి.. అధికారికంగా దర్శకుడు చిత్రానికి పనులు ప్రారంభించాడు సుకుమార్. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందనే టాక్ ఉంది. ఈ టీజర్ విడుదల సందర్భంగా సుకుమార్ తో తనకున్న అనుబంధన్ని నేరుగానే చెప్పాడు ఎన్టీఆర్. 'సుకుమార్ నాకు బాగా దగ్గరైన కావాల్సిన వ్యక్తి. దయచేసి నన్ను బయటివ్యక్తిగా.. గెస్టుగా చూడకండి' అన్నాడు ఎన్టీఆర్.

'మీరందరూ ఇలా థ్యాంక్స్ చెబుతుంటే నేను బయటి వ్యక్తిని అనే ఫీలింగ్ కలుగుతోంది. సుకుమార్ రైటింగ్స్ కు సంబంధించిన ఈ వెంట్ కు రావడం నాకు బరువు కాదు.. అది నా బాధ్యత. సుకుమార్ కోసం నేను ఎప్పుడూ ఉంటాను' అని చెప్పాడు ఎన్టీఆర్.