మా ఆవిడ కూడా అంతే -తారక్

Mon Sep 25 2017 23:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగా అన్ని తరహా పాత్రల్లో అలరించాడనే చెప్పాలి. అతి తక్కువ కాలంలో ఎక్కువ స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా బిగ్ బాస్ షోని కూడా తారక్ తనదైన శైలిలో విజయవంతంగా నడిపించి బుల్లి తెర ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఇక తారక్ సినిమాల్లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. జై లవకుశ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఇలా ఎన్టీఆర్ ఏ వైపు అడుగు వేసినా అన్ని విజయాలనే అందుకుంటున్నాడు. ఇక స్టార్ హీరోలు చేసే యాడ్స్ రూపంలో కూడా తారక్ గట్టిగానే సంపాదిస్తున్నాడు. గత కొంత కాలంగా ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీకి యంగ్ టైగర్ ప్రచార కర్తగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా దానికి సంబందించిన ఒక ప్రెస్ మీట్ లో తారక్ కి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎక్కువగా బిగ్ బాస్ ప్రస్తావన అక్కడ వచ్చింది. ‘మీ అమ్మగారికి బిగ్ బాస్ షోలో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తారక్ తనదైన శైలిలో సమాదానాన్ని  చెప్పాడు.

తారక్ మాట్లాడుతూ.. మా అమ్మ చూపు నన్ను దాటి ఎక్కడికి వెళ్లదు. మా అమ్మే అనుకుంటే ఈ మధ్య మా ఆవిడ కూడా అలానే తయారైందని చెబుతూ..అలాంటి ఇద్దరు మహిళలు నా జీవితంలో ఉండటం నిజంగా నా అదృష్టమని ఎన్టీఆర్ వివరించాడు. ఇక బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కి కూడా మిరే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారా అన్న ప్రశ్నకు తారక్ ఏమన్నాడంటే?. ఆ విషయం మాట్లాడడానికి ఇది తగిన సమయం కాదని స్వీట్ గా ఆన్సర్ ఇచ్చాడు.