Begin typing your search above and press return to search.

#RRR షూటింగ్ కి మహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   18 Jun 2018 4:48 AM GMT
#RRR షూటింగ్ కి మహూర్తం ఫిక్స్
X
బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు.. #RRR ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తో అద్భుతమైన కానుక ఇచ్చాడు. అయితే.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత.. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు తమ కొత్త ఫిలిమ్స్ షూటింగ్ స్టార్ట్ చేయడంతో.. రాజమౌళి మూవీ ఆలస్యం అవుతుందనే సంగతి అర్ధమయింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో అరవింద సమేత చేస్తున్న యంగ్ టైగర్.. దసరా నాటికి ఫ్రీ అయిపోతాడు. మరోవైపు మెగా పవర్ స్టార్ కూడా బోయపాటి మూవీని జూలై చివరి నాటికి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసేస్తాడు. రిలీజ్ సంక్రాంతికి షెడ్యూల్ చేయడంలో మాస్టర్ ప్లాన్ ఉంది కానీ అది వేరే సంగతి. అయితే.. రాజమౌళితో వీరిద్దరి మూవీని మాత్రం అక్టోబరులో లాంఛ్ చేస్తారట. అదే నెలలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి.. నవంబర్ లో షూటింగ్ బిగిన్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కథపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి కానీ.. వీటిలో ఏది కరెక్ట్ అనే సంగతి ఇప్పుడే చెప్పడం క్లిష్టమైన విషయం.

ప్రస్తుతానికి అయితే.. 2020 సంక్రాంతి నాటికి #RRRను విడుదల చేయాలన్నది ప్లాన్. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తేనే అది సాధ్యమవుతుంది. నేషనల్ లెవెల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు దేశం అంతా క్రేజ్ ఉన్న యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయబోతున్నారు.