అవసరాల టైటిల్ భలే ఉందే..!

Tue Feb 19 2019 11:35:25 GMT+0530 (IST)

యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ సినిమాలు ఈమధ్య తగ్గాయి. 'జ్యో అచ్యుతానంద' లాంటి లైటర్ వెయిన్ ఎంటర్టైనర్.. 'బాబు బాగా బిజీ' లాంటి అడల్ట్ సినిమాల తర్వాత పెద్దగా హడావుడి లేదు.  తాజాగా 'NRI- నాయనా రారా ఇంటికి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమాకు దర్శకుడు బాలా రాజశేఖరుని.  నిర్మాత ప్రదీప్. ఇద్దరూ కొత్తవారే.  తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి 20 తేదీన ప్రరంబిస్తున్నట్టుగా నిర్మాతలు తెలిపారు.  ఈ సినిమాలో అసలు హైలైట్ మంచు లక్ష్మి.  ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోందట. అసలే మంచు లక్ష్మి ఇంగ్లీష్ కు తెలుగునాట భారీగా అభిమానులున్నారు. మరి ఇలాంటి ఎన్నారై సినిమాలో మంచువారి ఆడపడుచు నటించడం సినిమాకే అందాన్ని తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.  అవసరాల శ్రీనివాస్.. మంచు లక్ష్మి కాంబినేషన్ అంటేనే ఫసాక్ కాంబినేషన్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు.  ఈ సినిమాలో నాగబాబు.. మహతి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారట.  

అవసరాల శ్రీనివాస్ రియల్ లైఫ్ లో కూడా ఎన్నారై కాబట్టి ఈ సినిమాలో ఎన్నారై పాత్రలో తప్పనిసరిగా మెప్పిస్తాడని ఆశించవచ్చు.  ఈ ఫస్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమెరికన్ ఫ్లాగ్ డిజైన్ ఉన్న టీ-షర్ట్ తో పాటు ఒక షార్ట్ వేసుకున్న అవసరాల చేతిలో టిష్యూ రోల్ ను  కృష్ణుడి సుదర్శన చక్రం లాగా పట్టుకున్నాడు.  మనం రోజూ సాయంత్రం అయితే సచిన్ స్టైల్ లో బ్యాట్ పట్టుకొని దోమలను చంపుతామే.. సరిగ్గా అలాంటి చైనా బజార్ బ్యాట్ అవసరాల పక్కనే ఠీవిగా నిలబడి ఉంది. ఇక మందు బాటిల్స్. వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి.  ఫుల్ ఫన్ అన్నమాట..!