Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: పాప బికినీతో లంక మటాష్!

By:  Tupaki Desk   |   14 Feb 2019 9:05 AM GMT
ఫోటో స్టొరీ: పాప బికినీతో లంక మటాష్!
X
ఈ ప్రపంచంలో ఎన్నో అందాలుంటాయి గానీ మన వార్తల్లో ఎక్కువగా చూసేది మాత్రం రేపులు.. మర్డర్లు. కాస్త టైమ్ మిగిలుంటే దాన్ని రాజకీయాలకు వినియోగిస్తాం.. అది కూడా 'కుళ్ళు.. కుళ్ళు..' అని తిట్టుకుంటూనే. మరి అదేపనిగా వాటినే చూస్తూ ప్రపంచం అంతా ఫ్రస్ట్రేషన్ తోనే నిండిపోయింది అనుకుంటే తప్పెవరిది? ఫన్ ఎక్కడి నుంచి వస్తుంది?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే సంచనా నటరాజన్ లాంటి భామలు తమ అందాలతో ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తున్నారు. వార్తలు చూసే కుళ్ళు కళ్ళతో మీరు మళ్ళీ "బికినీలే రేపులకు.. హత్యలకు మూలం" అని 'ఘట్టిగా' వాదిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అందుకేగా పెద్దాయన రావు రమేష్ తండ్రిగారు రావు గోపాలరావు గారు కూసింత కలాపోసన ఉండాలని శెలవిచ్చింది! ఆయన్నుమనం ఎంచక్కా ఫాలో అయిపోదాం. ఇంతకీ ఈ సంచన ఎవరంటే మోడల్ కం నటి. ఈ పాప 'నెరుంగి వా ముత్తమిడదే' అనే తెలుగు వాళ్ళకు అర్థం కాని టైటిల్ ఉండే తమిళ సినిమాతో కొలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'గురు'.. 'నోటా'.. '2.0' లాంటి సినిమాలో చిన్నచిన్న పాత్రలు చేసింది.

సినిమాల్లో పాత్రలు హీరోయిన్ రేంజ్ వి కాదు గానీ సోషల్ మీడియాలో మాత్రం హాటు ఘాటు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా బికినీ షోలు చేస్తుంటుంది. తాజాగా ఈ తమిళ భామ శ్రీలంక ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ బికినిలో జలకాలాడి సేద తేరింది.. అంతటితో ఆగలేదు.. అమ్మడికి ఏం అనిపించిందో కానీ తన బికినీ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిపారేసింది. ఒక చెట్టు కింద నీడలో చాప పై కూలింగ్ గ్లాసెస్ ధరించి కూర్చుంది. ఎలా ఉందంటే.. పాప తన బికినీ అందాలతో లంకను తగలబెట్టేలా ఉంది. మరి సోషల్ మీడియాలో నెటిజనులు ఎమైపోతారో? కొందరు హాటు.. సెక్సీ అని పొగిడారు కానీ కొందరు మాత్రం 'నీకు బికినీ అవసరమా?' అంటూ తమ అసహనం వెళ్ళగక్కారు.. అన్నీ కళ్ళు అందాలను ఒకేరకంగా చూడలేవు కదా. ఒకరికి హాటుగా కనిపించింది మరొకరికి మోటుగా కన్పించొచ్చు..ఇంతకీ మీరు ఏ కేటగిరీ..?