Begin typing your search above and press return to search.

NGK త‌మిళ్- తెలుగు ప్రీబిజినెస్

By:  Tupaki Desk   |   27 May 2019 5:52 AM GMT
NGK త‌మిళ్- తెలుగు ప్రీబిజినెస్
X
సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్- రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఎన్ జీకే. ర‌కుల్ ప్రీత్ సింగ్- సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌లు. ఒక సామాన్యుడు రాజ‌కీయ నాయ‌కుడిగా మారాల‌నుకుంటే ఎదురైన అవాంత‌రాలేంటి? వాటిని నంద‌గోపాల కృష్ణ అనే సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌దే క‌థాంశం. ఈనెల‌ 31న సినిమా రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు.. టీజ‌ర్.. ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ బిజినెస్ ఫ‌ర్వాలేద‌నిపించినా ఇరుగు పొరుగున సూర్య మార్కెట్ త‌గ్గిన నేప‌థ్యంలో అంత డిమాండ్ లేక‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే డ్రీమ్ వారియ‌స్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవ‌ర్సీస్ లో అత్యంత క్రేజీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అమెరికాలో దాదాపు 40 ఏరియాల్లో 150 పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. మే 30న భారీగా ప్రీమియ‌ర్ల‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మంగ‌ళ‌వారం నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుంది.

ఇంత‌కీ ఎన్‌ జీకే త‌మిళ్- తెలుగు ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత‌? అన్న‌ది ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలే తెలిశాయి. ఈ సినిమాకి త‌మిళ వెర్ష‌న్ థియేట్రిక‌ల్ బిజినెస్ 50కోట్ల మేర సాగింద‌ని తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లకు థియేట్రిక‌ల్ బిజినెస్ సాగుతోంది. ప్ర‌ఖ్యాత నిర్మాత కం పంపిణీదారుడు కె.కె.రాధామోహ‌న్ ఎన్ జీకే థియేట్రిక‌ల్ హ‌క్కులు తీసుకున్నారు. ఇప్ప‌టికే తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ మొద‌లైంది. త్వ‌ర‌లో హీరో సూర్య తెలుగు మీడియాకి అందుబాటులోకి రానున్నార‌ని తెలుస్తోంది.

NGK స‌న్నివేశం చూస్తుంటే ఈసారి త‌మిళం- ఓవ‌ర్సీస్ బిజినెస్ పై ఎక్కువ దృష్టి సారించార‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే త‌మిళ‌నాడు స‌హా విదేశాల్లో ఎక్కువ మొత్తంలో స్క్రీన్ల‌ను లాక్ చేస్తున్నార‌ట‌. ఇక తెలుగులో సూర్యకు వ‌రుస ఫ్లాపుల వ‌ల్ల మార్కెట్ రేంజ్ ఆశించినంత లేద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక ఈ సినిమాకి దాదాపు 60కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌య్యింది. ఇందులో స‌గం సూర్య పారితోషికం (35కోట్లు) అని చెబుతున్నారు. సెల్వ రాఘ‌వ‌న్ కు 5కోట్ల పారితోషికం.. ఇత‌రుల‌కు 5కోట్ల మేర పారితోషికాలు ముట్ట‌జెప్పార‌ట‌. ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ 15 కోట్ల మేర ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్రీబిజినెస్ లెక్క‌లు ప‌రిశీలిస్తే త‌మిళ రైట్స్ -50 కోట్లు.. తెలుగు రైట్స్ -9 కోట్లు.. శాటిలైట్-30 కోట్లు.. డిజిట‌ల్ రైట్స్ -10కోట్లు.. హిందీ రైట్స్ -10 కోట్లు ప‌లికింద‌ట‌. ఓవ‌రాల్ గా 110 కోట్ల మేర వ‌ర‌ల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ సాగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.