Begin typing your search above and press return to search.

తొలి సినిమా అడ్రస్ లేదు.. రెండో ఛాన్స్

By:  Tupaki Desk   |   18 Nov 2018 2:30 PM GMT
తొలి సినిమా అడ్రస్ లేదు.. రెండో ఛాన్స్
X
ఎస్.ఎస్.కాంచి.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతిభావంతుడతను. ‘అమృతం’ సీరియల్లో బాస్ పాత్రలో అద్భుతమైన కామెడీ పండించిన అతను.. ఆ తర్వాత ‘సై’ సహా చాలా సినిమాల్లో కామెడీ పాత్రలు చేశాడు. కాంచి మంచి రచయిత కూడా. ‘మర్యాద రామన్న’ సహా కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించాడు. కాంచికి దర్శకుడిగానూ అవకాశం దక్కింది. అతను ‘షో టైం’ పేరుతో ఒక వెరైటీ సినిమా కూడా తీశాడు. రణధీర్-రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన ఈ చిత్రం వెరైటీ ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించింది. కానీ ఏమైందో ఏమో కానీ.. ఆ సినిమా మరుగున పడిపోయింది. విడుదలకే నోచుకోలేదు.

రాజమౌళి సహా ఆ కుటుంబమంతా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసినా కూడా దీనికి మోక్షం కలగలేదు. జనాలు దీని గురించి పూర్తిగా మరిచిపోయారు. ఐతే ఆ సినిమా సంగతి వదిలేసి కాంచి తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటుండటం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ లో అతను ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మొదట్లో భారీ చిత్రాలే చేసిన మైత్రీ సంస్థ.. ఈ మధ్య చిన్న-మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తోంది. అందులో భాగంగానే కాంచితో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను మొదలుపెట్టబోతోందట మైత్రీ సంస్థ. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. మరి ‘షో టైం’ సంగతేమైందో.. కాంచి రెండో సినిమా వచ్చాకైనా దీనికి మోక్షం లభిస్తుందేమో చూడాలి.