Begin typing your search above and press return to search.

నష్టం తక్కువే అయినా కామ్రేడ్‌ పరిహారం

By:  Tupaki Desk   |   22 Aug 2019 4:13 AM GMT
నష్టం తక్కువే అయినా కామ్రేడ్‌ పరిహారం
X
'గీత గోవిందం' చిత్రంలో నటించిన విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్నల కాంబో మూవీ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వచ్చాయి. మైత్రి మూవీస్‌ వారిపై కూడా నమ్మకం కల గలిపి ఈ చిత్రంకు దాదాపుగా 33 కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. విజయ్‌ దేవరకొండ గత చిత్రాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. అయితే రౌడీ క్రేజ్‌ తో చాలా సింపుల్‌ గానే ఈ కలెక్షన్స్‌ రావడం ఖాయంగా అంతా భావించారు. కాని సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ ఆ స్థాయిలో రాలేదు. దాంతో బయ్యర్లు నష్టపోయారు.

సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ రావడంతో పాటు మొదటి వారం రోజులు గౌరవ ప్రధమైన షేర్‌ రావడంతో బయ్యర్లు మరీ దారుణమైన నష్టాల పాలైతే కాలేదు. కొన్ని ఏరియాల్లో పెట్టుబడిలో సగంకు పైగా రాగా.. కొన్ని ఏరియాల్లో ముప్పావు శాతం వరకు రిటర్న్స్‌ వచ్చాయి. ఓవరాల్‌ గా చూసుకుంటే కామ్రేడ్‌ బయ్యర్లు మరీ బలి ఏం కాలేదని చెప్పుకోవచ్చు. అయితే మైత్రి మూవీస్‌ వారు మాత్రం నష్టపోయిన బయ్యర్లకు పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చారు.

నష్టపోయిన దాదాపు అందరు బయ్యర్లకు కూడా మైత్రి మూవీస్‌ వారు పరిహారం చెల్లించి సెటిల్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. బయ్యర్లతో మంచి సంబంధాలుండాలనే ఉద్దేశ్యంతో మైత్రి వారు నష్టం తక్కువే అయినా కూడా పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. మైత్రి వారు తీసుకున్న ఈ నిర్ణయంతో బయ్యర్లు హ్యాపీ అయ్యారు. మైత్రి మూవీస్‌ బ్యానర్‌ లో గతంలో వచ్చిన సినిమాల విషయంలో కూడా ఇలాగే చేయడం జరిగింది. తమ సినిమాల వల్ల బయ్యర్లు నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో మైత్రి వారు మంచి మనసుతో ఇలా చేస్తున్నారు. అలా అని మైత్రి వారు నష్టాలను మాత్రం తెచ్చుకోవడం లేదు. డిజిటల్‌ మరియు శాటిలైట్‌ ఇతరత్ర రైట్స్‌ ద్వారా వచ్చే లాభాలను ఇలా బయ్యర్ల నష్టాలకు షేర్‌ చేస్తున్నారు.