Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: నేను రెడీగా లేనమ్మా

By:  Tupaki Desk   |   12 Feb 2019 11:30 AM GMT
టీజర్ టాక్: నేను రెడీగా లేనమ్మా
X
బాలీవుడ్ లో గత కొన్నేళ్ళుగా బయోపిక్ ల ట్రెండ్ ఊపందుకుంది. ఆ ట్రెండ్ లో భాగంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధిపై కూడా ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. 'మై నేమ్ ఈజ్ రాగా' పేరుతో తెరకెక్కే ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకు దర్శకుడు రూపేష్ పాల్.

పేరుకు టీజరే గానీ నిడివి మాత్రం నాలుగు నిముషాలు ఉంది. రాహుల్ గాంధి జీవితంలో జరిగిన సంఘటనలను బాల్యం నుంచి ఇప్పటివరకూ దాదాపుగా అన్ని కవర్ చేశారు. నానమ్మ ఇందిరా గాంధీ కంటి ముందే ఆడుకోవడం లాంటి మధుర స్మృతులతో పాటుగా తన కంటిముందే నానమ్మ దారుణ హత్యకు గురికావడం లాంటి సీన్స్ తో టీజర్ స్టార్ట్ అయింది. నాన్నగారు రాజీవ్ గాంధీతో గడిపిన క్షణాలు.. 'నాన్నా.. మిమ్మల్ని కూడా అలా చంపేస్తారా' అని చిన్నారి రాహుల్ ఆందోళనగా అడగడం లాంటి సీన్ ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు అమ్మతో 'నేను రెడీగా లేనమ్మా' అంటూ బేలగా చెప్పడం.. కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత కొన్ని బాధ్యతలను ఇష్టంలేకుండానే స్వీకరించాల్సి రావడం కూడా చూపించారు. ఫెయిల్యూర్లు ఎదురైన సమయంలో "మీరు ఫెయిల్ అయ్యారు కదా? మళ్ళీ ఫెయిల్ అవుతారని అనుకుంటున్నారా?" అని రిపోర్టర్లు అడిగితే.. "అవును.. నేను ఫెయిల్ అయ్యాను. మా నానమ్మ.. నాన్న ఇద్దరూ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చారు. అమరులయ్యారు. నేనిప్పుడు ఈ దేశం కోసం ఒకవేళ ఫెయిల్ అయినా అది నాకు గర్వకారణం" అంటూ ఓ టచింగ్ ఆన్సర్ ఇస్తాడు. ఇక నరేంద్ర మోడి పాత్ర రాహుల్ ను విమర్శించడం కూడా చూపించారు.

రాహుల్ పై పర్సనల్ గా ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చుగానీ.. జస్ట్ సినిమా కోణంలో చూస్తే మాత్రం టీజర్ ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించేదే. దర్శకుడు రూపేష్ ఈ సినిమాను ఒక బయోపిక్ లా చూడొద్దని రాహుల్ జీవితంలోని ఒడిదుడుకులను.. రాహుల్ స్ట్రగుల్ ను చూపించే ప్రయత్నం చేశానని అంటున్నాడు. ఎందుకాలస్యం.. ఒకసారి మీరూ గాంధీ ఫ్యామిలీ వారసుడి టీజర్ ను చూడండి.