మార్వెల్ వారి ముస్లిం సూపర్ హీరో

Wed May 16 2018 21:00:01 GMT+0530 (IST)

సూపర్ హీరో సినిమాలు తీయడంలో మార్వెల్ ను మించినవారు లేనే లేరు. థోర్ కెప్టెన్ అమెరికా ఐరన్ మాన్ స్పైడర్ మాన్ ఇంకా ఎంతోమంది సూపర్ హీరోలను మనకు పరిచయం చేసింది మార్వెల్ సంస్థ. ఈమధ్యనే మొట్టమొదట సారిగా అందరూ నల్ల జాతీయులతో బ్లాక్ పాంథర్ సినిమా తీసిన మార్వెల్ సంస్థ ఇప్పుడు మరొక సూపర్ హీరోను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది.ఈసారి మార్వెల్ విడుదల చేయబోయేది మాములు సూపర్ హీరో కాదు. ఒక ముస్లిం లేడీ సూపర్ హీరో. ఆ ముస్లిం సూపర్ హీరో ఎవరో కాదు మిస్ మార్వెల్. కెప్టెన్ మార్వెల్ ఆధారంగా నిర్మితమవ్వబోతున్న ఒక కథ ఇది. " మా మార్వెల్ కామిక్స్ లో కెప్టెన్ మార్వెల్ ఆధారంగా రూపుదిద్దుకున్న ముస్లిం సూపర్ హీరోనే మిస్ మార్వెల్. ముందు మేము కెప్టెన్ మార్వెల్ ను ప్రపంచానికి పరిచయం చేశాక అప్పుడు మా ప్లాన్స్ మొదలు పెడతాం" అని చెప్పారు మార్వెల్ ప్రెసిడెంట్ కెవిన్ ఫెయిజ్.

ఆ కారెక్టర్ అసలు పేరు కమలా ఖాన్ అంట. ఆమె న్యూ జెర్సీ కి చెందిన ఒక టీనేజ్ పాకిస్తానీ అమెరికన్. షేప్ షిఫ్టింగ్ మరియు హీలింగ్ ఫ్యాక్టర్లు ఆమె సూపర్ పవర్స్. మిగతా వివరాలు కెప్టెన్ మార్వెల్ విడుదల తరువాతే తెలియనున్నాయి. బ్రెయి లార్సన్ నటించిన కెప్టెన్ మార్వెల్ సినిమాను 2019 మార్చ్ కి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.