బాలీవుడ్ లో ఎంట్రీకి బాలయ్య హీరోయిన్

Thu Jul 12 2018 14:06:06 GMT+0530 (IST)

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘పైసా వసూల్ ’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ‘ముస్కాన్ సేథి’. ఈ సినిమాలో శ్రియా సిస్టర్ గా ముస్కాన్ నటించింది.  ఈ సినిమా తర్వాత ఈ ముంబై బ్యూటీకి అనుకున్న స్థాయిలో  అవకాశాలు రాలేదు.  కానీ ఇప్పుడు  బంపర్ చాన్స్ వచ్చింది.  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది.ఆశిఖి మూవీతో ఫేమస్ అయిన హీరో రాహుల్ రాయ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘సేవన్నీ’లో ముస్కాన్ హీరోయిన్ గా ఎంపికైంది.  నితిన్ కుమార్ గుప్తా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం రష్యా దుబాయ్ లలో ఈ సినిమా షూటింగ్ ను భారీస్థాయిలో ప్లాన్ చేశారు. ఈ సినిమాతోనైనా  బాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని నిధి భావిస్తోంది.