Begin typing your search above and press return to search.

మహేష్ - విజయ్ మల్టి స్టారర్.. కానీ

By:  Tupaki Desk   |   26 Sep 2017 7:31 AM GMT
మహేష్ - విజయ్ మల్టి స్టారర్.. కానీ
X
బాలీవుడ్ లో స్టార్ హీరోలు మల్టి స్టారర్ చేయడానికి చాలా వరకు ఇష్టపడతారు. ఇక ఆ సినిమాలు కూడా చాలా వరకు హిట్ అవుతాయి. కానీ సౌత్ లో మాత్రం అగ్ర హీరోలు మల్టి స్టారర్ సినిమాలు చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపారని టాక్ ఉంది. అందుకు కారణం లేకపోలేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా ఇద్దరి హీరోలను బ్యాలెన్స్ చేసుకుంటూ.. వెళ్లాలి. ఇద్దరి అభిమానులను సంతృప్తి పరిచేలా ఉండాలి. లేకుంటే మన అభిమానులు ఏ స్థాయిలో రెచ్చిపోతారో తెలిసిన విషయమే.

దీంతో దర్శకులు కూడా ఆ టెన్షన్ ఎందుకులే అని సైలెంట్ గా ఉంటారు. కానీ కొందరు దర్శకులు స్క్రిప్ట్ ఉంటె ఎలాగైనా మల్టి స్టారర్ సినిమా తియ్యాలని అనుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో మురగదాస్ కూడా అనుకుంటున్నాడట. రీసెంట్ గా స్పైడర్ ప్రమోషన్స్ లో భాగంగా మురగదాస్ ఈ విషయాన్ని చెప్పాడు. మహేష్ తో స్పైడర్ సినిమా చేయడం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెబుతూ.. మరొకసారి తనతో చేయాలనీ ఉందని చెప్పాడు.

అంతే కాకుండా తమిళ్ విజయ్ లో ఉండే లక్షణాలు మహేష్ లో కనిపిస్తున్నాయని వారిద్దరితో మల్టి స్టారర్ సినిమా చేయాలనీ ఉందని చెప్పారు. కానీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక టెన్షన్ ఉందని చెప్పారు.

తమిళ్ - తెలుగు ఇండస్ట్రీ కలిస్తే బాలీవుడ్ ని మించగలదని కూడా అయన చెప్పారు. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ.. మహేష్ చాలా బాగా నటించారు. సినిమాని తమిళ్ - తెలుగులో తెరకెక్కించాలంటే చాలా కష్టం. కానీ మహేష్ కృషి వల్ల కొంచెం ఈజీ అయ్యింది. అయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందుకోసమేనా సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు.