Begin typing your search above and press return to search.

మహేష్ టీజర్ కోసం స్పెషల్ ప్లాన్స్

By:  Tupaki Desk   |   30 Aug 2016 11:30 AM GMT
మహేష్ టీజర్ కోసం స్పెషల్ ప్లాన్స్
X
కబాలి సినిమా మొదలైనపుడు అంత హైప్ లేదు. కానీ విడుదలకు ముందు హైప్ ఏ రేంజికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికంతటికీ కారణం నిమిషం నిడివి ఉన్న ఆ సినిమా టీజరే. ఈ ఒక్క టీజర్ జనాల మతి పోగొట్టింది. సినిమా బిజినెస్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. మళ్లీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా రానంతగా హైప్ తీసుకొచ్చేసింది. ఒక టీజర్ ఎంత మ్యాజిక్ చేయగలదో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అందుకే టీజర్లు.. ట్రైలర్ల మీద ప్రస్తుతం దర్శకులు చాలా ఫోకస్ పెడుతున్నారు. తన ప్రతి సినిమా టీజర్ విషయంలోనూ చాలా శ్రద్ధ వహించే మురుగదాస్.. మహేష్ బాబుతో చేస్తున్న కొత్త సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసి.. సెప్టెంబరు తొలి వారంలో రెండో షెడ్యూల్ ఆరంభించబోతున్న మురుగదాస్.. టీజర్ కోసం స్పెషల్ షూట్ ఒకటి ప్లాన్ చేశాడట. ఒకట్రెండు రోజులు కేవలం ఈ టీజర్ కోసమే షూటింగ్ జరుగుతుందట. అభిమానులకు కిక్కిచ్చేలా.. సినిమా మీద అంచనాలు పెంచేలా ఈ టీజర్ ప్లాన్ చేస్తున్నాడట మురుగ. అక్టోబర్లో ఈ టీజర్ జనాల ముందుకు రావొచ్చని సమాచారం. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్వీ ప్రసాద్.. అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి షూటింగ్ చేసి.. ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.