Begin typing your search above and press return to search.

స్పైడర్ అందుకే ఆలస్యమైంది

By:  Tupaki Desk   |   22 Aug 2017 12:37 PM GMT
స్పైడర్ అందుకే ఆలస్యమైంది
X
మహేష్ ఒక సినిమాను మొదలు పెట్టాడు అంటే వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. కెరీర్ లో ఒకటి రెండు సినిమాలు తప్పితే దాదాపు ఆయన సినిమాలన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్స్ కంప్లిట్ చేసుకున్నవే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో లలో అనుకున్న టైమ్ కి సినిమాను రిలీజ్ చేయగల హీరోలలో ఒకడు మహేష్. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మెన్ సినిమాను మహేష్ 74 రోజుల్లో పూర్తి చేసిన విషయం తెలిసిందే.

అయితే గత ఏడాది బ్రహ్మోత్సవం సినిమాతో ఊహించని ఎదురుదెబ్బని చూసిన మహేష్ స్పైడర్ సినిమాను ఒప్పుకున్నాడు. మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదట. ఇప్పటికే రిలీజ్ డేట్ ను చెప్పేసిన చిత్ర యూనిట్. ఇంకా సినిమాను పూర్తి చేయకపోవడంతో కొంత ఆందోళనలో ఉన్నారట నిర్మాతలు. అయితే దాదాపు సంవత్సరం పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను తెలుగు - తమిళ్ లో తెరకెక్కించాడట దర్శకుడు. రెండు భాషల్లో ఒకేసారి కొన్ని షాట్స్ ని తియ్యడం వల్ల ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఇంకా ఒక పాట బ్యాలెన్స్ ఉందట.

ముఖ్యంగా తెలుగు-తమిళ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మురుగదాస్ కొన్ని సీన్స్ ను సపరేట్ గా రాసుకున్నాడట. ఒక భాషలో చేసిన సిన్ మళ్లీ వేరే భాషలో వేరేగా తీసేవాడట దర్శకుడు. అందువల్ల లేట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 150 కోట్లతో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను ఠాగూర్ మధు మరియు ఎన్వీ ప్రసాద్ నిర్మాణంలో సెప్టెంబర్ 27 థియేటర్లలో సందడి చేయనుంది.హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.