మురుగదాస్ కి ఆ సీన్స్ నచ్చలేదంట

Thu Jan 12 2017 12:23:49 GMT+0530 (IST)

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తొలి రోజు రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. పండుగ సీజన్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకోవడం ఖాయం అని చెప్పచ్చు. ఖైదీ నంబర్ 150.. తమిళ సినిమా కత్తికి రీమేక్ అనే సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మురుగదాస్ ప్రస్తుతం టాలీవుడ్ మూవీ చేస్తున్నాడు. మహేష్ బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న మురుగదాస్.. ఇప్పుడు హైద్రాబాద్ లోనే ఉన్నాడు. అంతే కాదు.. ఖైదీ నంబర్ 150మూవీని చూసి తెగ ఆశ్చర్యపోయాడట. ముఖ్యంగా ఈ సినిమాలో ఆల్కహాన్ సీన్స్ చూసి బాగా డిజప్పాయింట్ అయ్యాడట ఈ దర్శకుడు. తమిళ్ కత్తిలో కూడా విలన్ గ్రీన్ టీ తాగుతున్నట్లు చూపిస్తారు తప్ప.. ఆల్కహాల్ కనిపించదు. కానీ తెలుగులో మాత్రం చిరంజీవి.. ఆలీ.. బ్రహ్మానందంల మధ్య లిక్కర్ తో కామెడీ ట్రాక్ చూసి.. అసలు దీని అవసరం ఏంటి అని ఫీలయ్యాడట మురుగదాస్.

అలాగే ఆలీతో లేడీ గెటప్ వేయించిన సన్నివేశంపై కూడా ఆశ్చర్యపోయాడట. ఈ మార్పుల గురించి ముందు డిస్కస్ చేసినా.. సినిమాలో వాటిని చూసి షాక్ తినేశాడని తెలుస్తోంది. తమిళ్ మూవీని తెలుగు ఆడియన్స్ కోసం తిరిగి మార్చి రాయడం అంటే.. మెగాస్టార్ కోసం అదనపు హంగులు చేకూర్చడం అంటే ఏంటో.. ఇప్పుడు మురుగదాస్ కి క్లియర్ గా అర్ధం అయుంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/