Begin typing your search above and press return to search.

వాట్ ఎ పోస్టర్ మురుగదాస్..

By:  Tupaki Desk   |   28 July 2016 11:36 AM GMT
వాట్ ఎ పోస్టర్ మురుగదాస్..
X
ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా ఏ హీరోయిన్ చేయని విన్యాసాలు చేయడానికి సిద్ధమైపోతోంది సోనాక్షి సిన్హా. ఇప్పటికే ‘అకిరా’ ట్రైలర్లో సోనాక్షి విన్యాసాలు చూసి జనాలకు దిమ్మదిరిగింది. సినిమాలో యాక్షన్ డోస్ మరింత ఎక్కువే ఉండేలా ఉంది. ‘అకిరా’ ప్రోమోస్ అలా ఉన్నాయి మరి. ఇప్పటికే సోనాక్షి ఫెరోషియస్ లుక్స్‌ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా మురుగదాస్ మరో కొత్త పోస్టర్ వదిలాడు. అందులో సోనాక్షి తలంత ఎత్తుకు పైకి ఎత్తి బ్రూస్ లీ పోజు పెట్టింది. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఓ హీరోయిన్ ఇలాంటి పోజు ఇవ్వడం ఇదే తొలిసారి కావచ్చేమో. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే విదేశీ చిత్రాల్లో మాత్రమే హీరోయిన్లు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటారు. మన దగ్గర హీరోయిన్లను అందాల రాశులుగా చూపించడమే తప్ప.. ఇలా ఫెరోషియస్‌ గా ప్రెజెంట్ చేయడం అరుదు. ఒకటీ అరా ఫైట్లయితే చేయిస్తారు కానీ.. మరీ ఈ స్థాయి యాక్షన్ అంటే కష్టం.

ఐతే మురుగదాస్ మాత్రం సోనాక్షితో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. ‘అకిరా’.. తమిళ సూపర్ హిట్ ‘మౌనగురు’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అది హీరో ఓరియెంటెడ్ గా సాగే కథ అయితే.. హిందీకి హీరోయిన్ని లీడ్ రోల్ లోకి మార్చి ఓ ప్రయోగం చేశాడు మురుగ. ‘అకిరా’ ట్రైలర్ పెద్ద సెన్సేషనే అయింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఎన్నడూ రానంత హిట్స్ వచ్చాయి. సెప్టెంబరు 2న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.