Begin typing your search above and press return to search.

మహేష్ ప్రత్యేకతేంటో చెప్పిన మురుగ

By:  Tupaki Desk   |   25 Sep 2017 6:27 AM GMT
మహేష్ ప్రత్యేకతేంటో చెప్పిన మురుగ
X
తాను పని చేసిన సూపర్ స్టార్లలో మహేష్ బాబు చాలా ప్రత్యేకమని ‘స్పైడర్’ దర్శకుడు మురుగదాస్ తెలిపాడు. మహేష్ ఏ హడావుడి లేకుండా నటిస్తూనే.. తన పాత్రకు స్టార్ ఇమేజ్ తీసుకు రాగల ప్రత్యేకమైన నటుడని మురుగదాస్ తెలిపాడు. ‘స్పైడర్’ లాంటి సవాలుతో కూడుకున్న సినిమాను తాను ఏ ఇబ్బందీ లేకుండా పూర్తి చేయగలిగానంటే అందుకు ప్రధాన కారణం మహేషే అని మురుగదాస్ చెప్పాడు.

‘‘మహేష్ తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనలో చాలా అరుదైన లక్షణాలున్నాయి. మహేష్ బాబులో హీరోయిజం ఉంటుంది. నాకీ చాలా సహజంగా ఉంటుంది. రజినీకాంత్ సార్ సినిమాలు చూసి ఎదిగిన వాడిని నేను. కాబట్టి మాస్ అంశాల్ని విడిచిపెట్టలేదు. అలాగని ఓ సినిమా తీశాక ఐదేళ్ల తర్వాత చూసుకుంటే ఏదోలా అనిపించకూడదు. నా కొడుకు వచ్చిన ఏంటి ఇలా సినిమా తీశావు అని నవ్వకూడదు. ఏ సినిమా చేసినా ఐదేళ్ల తర్వాత చూసుకున్నా కనెక్టయ్యేలా ఉండాలన్నది నా అభిప్రాయం.

ఇలా చేయాలనుకున్నపుడు అందుకు సరిపోయే నటుడు మహేష్ బాబు. మహేష్ ఉంటే హీరోయిజం అతిగా చూపించాల్సిన అవసరం లేదు. చాలా అందంగా హీరోయిజం చూపిస్తాడు. కథలో భాగంగా హీరోయిజం చూపించే అరుదైన కథానాయకుడు మహేష్. అందుకే ఆయనతో పని చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అది ‘స్పైడర్’ సినిమాతో కుదిరింది. మహేష్ తో సినిమా అన్నాక ద్విభాషా చిత్రమైతే బాగుంటుందనిపించింది. కానీ సినిమా మొదలయ్యాక అది ఎంత పెద్ద సవాలో అర్థమైంది. ఆ సవాల్ ను ఛేదించడానికి నాకు చాలా శక్తి ఇచ్చింది మహేషే’’ అని మురుగదాస్ తెలిపాడు.